RCB vs CSK : చెన్నైపై ఆర్‌సీబీ గెలవగానే చిన్నస్వామి స్టేడియంలో యువతి రచ్చ రచ్చ.. బెదిరిపోయిన సీఎస్‌కే ఫ్యాన్.. వీడియో వైరల్..
ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య (RCB vs CSK) మ్యాచ్ జరిగింది.
- Thota Vamshi Kumar
- Updated on- April 6, 2026 / 01:07 PM IST
IPL 2026 Fan girl celebrating Royal Challengers Bengaluru victory against CSK video viral
- ఆదివారం చిన్నస్వామి వేదికగా జరిగిన ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్
- విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- స్టేడియంలో ఆర్‌సీబీ లేడి ఫ్యాన్ సెలబ్రేషన్స్ వైరల్
RCB vs CSK : ఐపీఎల్‌లో ఎన్ని జట్లు ఉన్నప్పటికి కూడా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఉండే క్రేజే వేరు. ఇక ఈ రెండు జట్లు మైదానంలో తలపడ్డాయంటే ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్. తమ జట్టే గెలవాలంటూ ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తుంటారు. ఇక మ్యాచ్ గెలిచిన తరువాత ఆయా ఆయా జట్ల ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.
తాజాగా ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టు 43 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
KKR vs PBKS : కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే ఎవరికి లాభం అంటే?
మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిచిన తరువాత ఓ మహిళా అభిమాని చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్‌సీబీ జట్టు గెలవగానే.. ఓ మహిళా అభిమాని పక్కనే ఉన్న సీఎస్‌కే ఫ్యాన్ వైపు తిరిగి బిగ్గరగా అరుస్తూ ఉత్సాహంతో సెలబ్రెట్ చేసుకుంది. ఆ యువతి అరుస్తున్నప్పుడు సీఎస్‌కే ఫ్యాన్స్ కాస్త నిదానంగానే ఉన్నాడు. కాస్త కామ్‌గా ఉండూ అంటూ సైగ చేశాడు. అయితే.. ఆ యువతి మాత్రం అతడిని ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ వీడియో వైరల్ కాగా.. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది.. మా టైమ్ కూడా వస్తుందని ఆ సీఎస్‌కే ఫ్యాన్ అనుకుని ఉంటాడని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికి కూడా ఈ వీడియోను ఆర్‌సీబీ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఆర్‌సీబీ పై అభిమానం ఇలాగే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
