Sanjiv Goenka : దేవుడా గెలిపించావా.. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా రియాక్షన్స్ వైరల్.. పంత్‌ను కలిసి..
లక్నో విజయం సాధించడంతో ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా (Sanjiv Goenka) ఇచ్చిన రియాక్షన్స్ వైరల్ అవుతున్నాయి.
Sanjiv Goenka Reactions Viral in IPL 2026 SRH vs LSG match
- ఐపీఎల్ 2026లో గెలుపు బోణీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్
- ఆదివారం ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌పై విజయం
- మ్యాచ్ సందర్భంగా, గెలిచినప్పుడు లక్నో యజమాని సంజీవ్ గొయెంకా రియాక్షన్స్ వైరల్
Sanjiv Goenka : ఐపీఎల్ 2026లో ఎట్టకేలకు లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు బోణీ కొట్టింది. ఆదివారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన లక్నో జట్టు రెండో మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా ఇచ్చిన రియాక్షన్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (41 బంతుల్లో 62 పరుగులు), నితీశ్ కుమార్ రెడ్డి (33 బంతుల్లో 56 పరుగులు) అర్థశతకాలు సాధించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. దిగ్వేష్ సింగ్ రాఠీ, మణిమారన్ సిద్ధార్థ్ చెరో వికెట్ సాధించారు.
Bhuvneshwar Kumar : చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్.. ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక పేసర్..
MOST HAPPIEST MAN LSG OWNER SANJIV GOENKA pic.twitter.com/CJB6N5R0Yk
— Ravi (@RaviWritess) April 5, 2026
అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో బ్యాటర్లలో రిషబ్ పంత్ (50 బంతుల్లో 68నాటౌట్), ఐడెన్ మార్క్రమ్ (27 బంతుల్లో 45 పరుగులు) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్ష్ దూబె రెండు వికెట్లు తీయగా.. ఈషాన్ మలింగ, శివంగ్ కుమార్ లు చెరో వికెట్ పడగొట్టాడు.
సంజీవ్ గొయెంకా రియాక్షన్స్ వైరల్..
ఇక ఈ మ్యాచ్ సందర్భంగా, లక్నో జట్టు విజయం సాధించిన అనంతరం సంజీవ్ గొయెంకా ఇచ్చిన రియాక్షన్స్ వైరల్‌గా మారాయి.
Prayers worked 🙏
Sanjiv Goenka celebrates as Lucknow Super Giants rattle Sunrisers Hyderabad top order early! ❤️💙 pic.twitter.com/ik7LWstW8Y— 𝐆𝐚𝐮𝐫𝐚𝐯 𝐒𝐢𝐧𝐠𝐡 (@imGauravsingh96) April 5, 2026
ముందుగా ఇషాన్ కిషన్‌ను ప్రిన్స్ యాదవ్ ఔట్ చేసినప్పుడు చేతిలో ఏదో పట్టుకుని మొక్కుకుంటున్నట్లుగా కనిపించాడు. పంత్ విన్నింగ్ షాట్ కొట్టినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్‌ను హత్తుకున్నాడు. మొత్తంగా సంజీవ్ గొయెంకా ఇచ్చిన రియాక్షన్లు వైరల్ అవుతుండగా.. ఇంతకముందు ఎన్నడూ కూడా అతడిని ఇలా చూడలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Sanjiv Goenka and Rishabh Pant on the ground after LSG’s first win. pic.twitter.com/cC6oOi0Gqd
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 5, 2026
