పాత ఫోన్లతో అభిమాని గిఫ్ట్: కోహ్లీ ఫిదా
- Subhan Ali Shaik
- Published On : January 5, 2020 / 10:43 AM IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అభిమాని ఇచ్చిన క్రేజీ గిఫ్ట్‌కు ఇంప్రెస్ అయిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న కోహ్లీకి గిఫ్ట్‌లు కొత్తకాకపోవచ్చు. ఒంటిపైనే కోహ్లీ ఫొటోను టాటూ వేయించుకున్న వారున్నారు. ఇలానే కోహ్లీ కోసం గువాహటి అభిమాని కొత్త ప్రయోగం చేశాడు. మూడు పగళ్లు, మూడురాత్రులు కష్టపడి పాత ఫోన్లతో కోహ్లీ బొమ్మను చేశాడు.
ఆదివారం గువాహటి వేదికగా టీమిండియా.. శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. ఈ క్రమంలో హోటల్ లో బస చేస్తున్న కోహ్లీ కోసం అభిమాని గిఫ్ట్ తీసుకెళ్లాడు. అది చూసిన కోహ్లీ ఇంప్రెస్ అయిపోయి ఆ బొమ్మను తన దగ్గరే ఉంచుకోమని ఆటోగ్రాఫ్ ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.
మూడు టీ20ల సిరీస్ లో భాగంగా టీమిండియా.. శ్రీలంకతో ఆదివారం బర్సాపరా క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ ఆడనుంది. మరి కొద్ది నెలల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2020 కోసం సిద్ధమవుతూనే సంవత్సరాన్ని విజయంతో ఆరంభించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
చివరి టీ20సిరీస్ లో భారత్.. వెస్టిండీస్ ను 2-1తేడాతో ఓడించింది. ఈ సిరీస్ లో కోహ్లీ 183పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Making art out of old phones.
How is this for fan love! ?? #TeamIndia @imVkohli pic.twitter.com/wnOAg3nYGD— BCCI (@BCCI) January 5, 2020
