Sachin Tendulkar: సచిన్.. సచిన్.. సచిన్.. విమానంలో హోరెత్తిన ఫ్యాన్స్ నినాదాలు.. ఎందుకంటే

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఆయనపై అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనమే తాజా ఘటన. ఇటీవల సచిన్ టెండూల్కర్ ఒక విమానంలో ప్రయాణించాడు.

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్.. క్రీడా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్‌లో తన ఆటతీరుతో దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఆయనపై అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
Jharkhand: పెరుగుతున్న శ్రద్ధా తరహా హత్యలు.. భార్యను చంపి 12 ముక్కలు చేసిన భర్త
దీనికి నిదర్శనమే తాజా ఘటన. ఇటీవల సచిన్ టెండూల్కర్ ఒక విమానంలో ప్రయాణించాడు. సచిన్ ఎక్కిన విమానంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్లంతా సచిన్‌ను చూడగానే ఉత్సాహంతో ఉప్పొంగిపోయారు. అందరూ సచిన్.. సచిన్.. అంటూ అరుస్తూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాన్ని కొందరు ప్రయాణికులు వీడియో కూడా తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సచిన్‌కు ఇప్పటికీ ఉన్న క్రేజ్‌కు ఈ వీడియో మరో నిదర్శనంగా చెప్తున్నారు ఫ్యాన్స్. ఈ వీడియోలో సచిన్ కనిపించలేదు. కానీ, ఈ వీడియోపై సచిన్ స్పందించాడు. తాను విమానంలో ఉన్నప్పుడు తన పేరుతో నినాదాలు చేస్తూ, తనపై చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపాడు. అయితే, ఆ సమయంలో తాను సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటం వల్ల లేచి, అందరినీ విష్ చేసే అవకాశం లభించలేదని, కానీ, తాను ఇప్పుడు అందరికీ హలో చెబుతున్నానంటూ ట్వీట్ చేశాడు.
Annamalai: నాలుగే మేకలున్న వ్యక్తి చేతికి రూ.5 లక్షల వాచ్ ఎలా వచ్చింది? బీజేపీని ప్రశ్నించిన డీఎంకే
తన గురించి ట్రెండ్ చేస్తున్న అభిమానుల వీడియోకు కూడా సచిన్ స్పందించడం విశేషం. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు నమోదు చేసిన సచిన్ 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆటకు దూరమై తొమ్మిదేళ్లు అవుతున్నా ఆయనపై అభిమానం తగ్గలేదు.

ట్రెండింగ్ వార్తలు