Shoaib Malik : షోయబ్ మాలిక్ జీ.. ఈ ‘3’ లాజిక్ ఏంటో కాస్త చెప్పరు..! మరీ అంత ఇష్టం ఏంటో..!
మాలిక్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- January 23, 2024 / 03:42 PM IST
Shoaib Malik
Shoaib Malik : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత వారం రోజులుగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకున్న మాలిక్ వెంటనే పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. కాగా.. షోయబ్‌కు ఇది మూడో వివాహం కావడం గమనార్హం. తన మూడో పెళ్లికి సంబంధించిన ఫోటోలను స్వయంగా అతడే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి చాలా మంది మాలిక్‌ను తిట్టి పోస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ విషయాలను పెద్దగా పట్టించుకోని మాలిక్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఫార్చ్యూన్ బరిషాల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల అతడు టీ20 క్రికెట్లో 13,000 పరుగులు మైలురాయిని అందుకున్న మొదటి ఆసియా క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి మాలిక్ ట్రోలింగ్‌కు గురి అయ్యాడు. అయితే.. ఈ సారి అతడి ఆటతీరు కారణంగానే.
WPL 2024 : డబ్ల్యూపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. పూర్తి లిస్ట్ ఇదే.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే..?
సోమవారం ఫార్చూన్ బరిషల్, ఖుల్నా టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఫార్చూన్ బరిషల్ తరుపున ఆడుతున్న మాలిక్ ఒకే ఓవర్లో మూడు నోబాల్స్ వేశాడు. ఖుల్నా టైగర్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫార్చూన్ బరిషల్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ పవర్ ప్లేలో నాలుగో ఓవర్లోను మాలిక్‌ను వేయాల్సిందిగా కోరాడు. బంతిని అందుకున్న షోయబ్ ఆ ఓవర్లో మొత్తం మూడు నోబాల్స్ వేయడంతో పాటు ఏకంగా 18 పరుగులు ఇచ్చాడు. మాలిక్ ఓవర్ కారణంగా ఖుల్నా టైగర్స్ లక్ష్యఛేదనలో నాలుగు ఓవర్లలోనే యాభై పరుగుల మార్క్‌ను దాటింది. ఈ మ్యాచ్‌లో ఖుల్నా టైగర్స్ 188 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది.
మాలిక్ ఓకే ఓవర్లో మూడు నోబాల్స్ వేయడం పై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. మొన్ననే మూడో పెళ్లి చేసుకున్నావ్, ఇప్పుడు మూడు నోబాల్స్ వేశావు. ఏంటి కథా మూడు అంటే నీకు అంత ఇష్టమా అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
SA20 2024 : ఆనందంలో నువ్వేం చేశావో నీకు తెలుసా తల్లీ..!
