SA20 2024 : ఆనందంలో నువ్వేం చేశావో నీకు తెలుసా త‌ల్లీ..!

ద‌క్షిణాఫ్రికాలో నిర్వ‌హిస్తున్న SA20 లీగులోని మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి.

SA20 2024 : ఆనందంలో నువ్వేం చేశావో నీకు తెలుసా త‌ల్లీ..!

SA20 2024 Fan Chugs Beer and Goes Viral

SA20 2024 : ద‌క్షిణాఫ్రికాలో నిర్వ‌హిస్తున్న SA20 లీగులోని మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. శుక్ర‌వారం కేప్‌టౌన్‌లో పార్ల్ రాయ‌ల్స్‌, ఎంఐ కేప్‌టౌన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచులో 8 వికెట్ల తేడాతో ఎంఐ విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో రాయ‌ల్స్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 172 ప‌రుగులు చేసింది. రాయ‌ల్స్ బ్యాట‌ర్ల‌లో జోస్ బ‌ట్ల‌ర్ (46; 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), జేస‌న్ రాయ్ (38; 14 బంతుల్లో 1 ఫోర్ 5 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడారు. ఎంఐ బౌల‌ర్ల‌లో థామస్ కబెర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు.

అనంత‌రం ల‌క్ష్యాన్ని ఎంఐ 16.5 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెన‌ర్ ర్యాన్ రికెల్టన్ (94; 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. మ‌రో ఓపెన‌ర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (41; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో ఎంఐ ఈజీగా విజ‌యం సాధించింది. కాగా.. ఈ సీజ‌న్‌లో ఎంఐకి ఇది రెండో గెలుపుకాగా.. రాయ‌ల్స్‌కు మొద‌టి ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం..

రెండో పెళ్లి చేసుకున్న షోయ‌బ్ మాలిక్‌.. సానియాతో విడాకులు నిజ‌మేనా?

లాక్కోని మ‌రీ గ్లాసు బీర్‌..

కాగా.. ఈ మ్యాచ్‌ను చూసేందుకు వ‌చ్చిన ప్రేక్ష‌కుల్లోని ఓ యువ‌తి చేసిన ప‌ని ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. పార్ల్ రాయ‌ల్స్ ఇన్నింగ్స్ న‌డుస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాయ‌ల్స్ ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్‌లో కెమెరా మెన్ మైదానంలోని ప్రేక్ష‌కుల వైపుకు కెమెరాను జూమ్ చేశాడు. స్క్రీన్ పై తాము క‌న‌ప‌డ‌డం ప్రేక్ష‌కుల్లో మంచి జోష్ వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో ఆనందంలో ఓ యువ‌తి ప‌క్క‌నే ఉన్న వ్య‌క్తి చేతిలోంచి బీర్ గ్లాస్‌ను అందుకుని మొత్తం తాగేసింది. ఆ త‌రువాత ఆనందంతో గెంతులు వేసింది. ప‌క్క‌నే ఉన్న వారు కూడా ఆమెను ప్రోత్స‌హించారు. ఇదంతా కెమెరాలో రికార్డు కావ‌డంతో పాటు లైవ్‌లోనూ వ‌చ్చింది. ఈ వీడియోను ఎస్ఏ 20 తన సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఓపెనింగ్ రేసు.. ముందంజ‌లో య‌శ‌స్వి జైస్వాల్‌.. వెనుక‌బ‌డిన శుభ్‌మ‌న్‌ గిల్