T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఓపెనింగ్ రేసు.. ముందంజ‌లో య‌శ‌స్వి జైస్వాల్‌.. వెనుక‌బ‌డిన శుభ్‌మ‌న్‌ గిల్

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు మ‌రో నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంది.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఓపెనింగ్ రేసు.. ముందంజ‌లో య‌శ‌స్వి జైస్వాల్‌.. వెనుక‌బ‌డిన శుభ్‌మ‌న్‌ గిల్

Shubman Gill-Yashasvi Jaiswal

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు మ‌రో నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంది. అయినప్ప‌టికీ కూడా ఇప్ప‌టి నుంచే ఈ మెగా టోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టు పై చ‌ర్చ జ‌ర‌గుతోంది. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ముందు టీమ్ఇండియా త‌న ఆఖ‌రి టీ20 సిరీస్‌ను ఆడేసింది. అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన ఈ సిరీస్‌ను భార‌త్ 3-0తో క్లీన్‌స్లీప్ చేసింది. ఈ సిరీస్‌లో యువ ఆట‌గాళ్లు శివ‌మ్ దూబె, య‌శ‌స్వి జైస్వాల్ లు ఆక‌ట్టుకున్నారు. వీరిద్ద‌రిని ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేయాల‌నే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు, కామెంటేట‌ర్ ఆకాశ్ చోప్రా సైతం దీనిపై స్పందించాడు.

త‌న యూట్యూబ్ ఛానెల్‌లో అత‌డు మాట్లాడుతూ.. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు జోడీగా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ ను ఎంపిక చేయాల‌ని సూచించాడు. రేసులో శుభ్‌మ‌న్ గిల్ ఉన్న‌ప్ప‌టికీ కూడా అత‌డి కంటే ఓ అడుగు ముందు జైస్వాల్ ఉన్న‌ట్లు చోప్రా అభిప్రాయ‌ప‌డ్డాడు.

PCB : పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ముస‌లం? పీసీబీ ఛైర్మన్‌ పదవికి జకా అష్రఫ్‌ రాజీనామా..

గ‌తేడాది వెస్టిండీస్‌పై అరంగ్రేటం చేసిన నాటి నుంచి జైస్వాల్ టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడ‌ని చెప్పుకొచ్చాడు. ఇటీవ‌ల జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో దక్షిణాఫ్రికాపై 60 పరుగులు, ఇండోర్‌లో టీ20లో 68 ప‌రుగుల‌తో సత్తా చాటాడ‌ని అన్నారు. మ‌రోవైపు గిల్ ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగిన రెండు టీ20 మ్యాచుల్లో ఎనిమిది ప‌రుగులు, అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20 మ్యాచులో త‌క్కువ స్కోరుకే ఔట్ అయిన విష‌యాల‌ను గుర్తు చేశాడు.

అది క‌ష్ట‌మే..

టీమ్ఇండియా టీ20 జ‌ట్టులో య‌శ‌స్వి జైస్వాల్ త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడ‌ని, అత‌డిని త‌ప్పించ‌డం సెలెక్ట‌ర్ల‌కు చాలా క‌ష్ట‌మైన ప‌ని అని చెప్పాడు. ‘యశస్వి మూడు (చివరి రెండు) గేమ్‌లలో ఓపెన‌ర్‌గానే వ‌చ్చాడు. అత‌డు సూప‌ర్ ఓవ‌ర్‌లోనూ ఓపెన‌ర్‌గా వ‌చ్చాడు. య‌శ‌స్వి ఆడుతున్న విధానం చూస్తుంటే అత‌డికి జ‌ట్టు నుంచి తీసివేయ‌డం క‌ష్ట‌మ‌ని అనిపిస్తోంది. ఇండోర్‌లో యశస్వి ఎలా ఆడాడో, అంత‌ముందు కూడా అత‌డు ఎలా ఆడాడో మ‌నం చూశాం. దీన్ని బ‌ట్టి అత‌డు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఖ‌చ్చితంగా ఉంటాడు.’ అని చోప్రా అన్నాడు.

టీమ్ఇండియా త‌రుపున జైస్వాల్ 16 టీ20లు ఆడాడు. 161.93 స్ట్రైక్-రేట్‌తో 33.46 స‌గ‌టుతో 502 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, నాలుగు అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. మ‌రోవైపు గిల్ 14 టీ20 మ్యాచుల్లో 147.6 స్ట్రైక్ రేటుతో 335 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ శ‌త‌కం, ఓ అర్ధ‌శ‌త‌కం ఉంది.

IND vs PAK : టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ కోసం డ్రాప్‌-ఇన్ పిచ్‌..! అంటే ఏమిటో తెలుసా?

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో గిల్ గుజ‌రాత్ టైటాన్స్ త‌రుపున‌, య‌శ‌స్వి జైస్వాల్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున ఆడ‌నున్నారు. ఐపీఎల్‌లో వీరిద్ద‌రు ఎలా ఆడ‌తారు అన్న‌ది కూడా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వీరి చోటుని నిర్ణ‌యించ‌నుంది.