FIFA World Cup : ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ ఎన్ని సార్లు ఆడిందో తెలుసా?

అమెరికా, మెక్సికో, కెన‌డా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026లో (FIFA World Cup) మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి

Do you know how many times India played in FIFA World Cup

FIFA World Cup : అమెరికా, మెక్సికో, కెన‌డా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026లో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. మొత్తం 48 జ‌ట్లు ఈ సారి క‌ప్పు కోసం పోటీప‌డుతున్నాయి. అయితే.. ఈ మెగాటోర్నీలో భారత ఫుట్‌బాల్ జట్టు లేక‌పోవ‌డంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (AFC) అర్హత పోటీల్లో భారత జట్టు రెండో రౌండ్‌ను దాటలేకపోవడంతో ప్రపంచకప్ ఆశలు ఎప్పుడో ముగిశాయి.

ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఫిపా ప్రపంచ‌క‌ప్‌లో ఒక్క‌సారి అయిన పాల్గొందా? లేదా అన్న సందేహాలు స‌గ‌టు భార‌త ఫుట్‌బాల్ అభిమానుల‌కు రాక మాన‌దు.

Vaibhav Sooryavanshi : మ‌రోసారి వైభ‌వ్ సూర్య‌వంశీ విఫ‌లం.. బుడ్డోడికి ఏమైంది?

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడే అవకాశం భార‌త్ కు ఓసారి వ‌చ్చింది. 1950లో బ్రెజిల్ వేదిక‌గా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌కు భారత్ అర్హత సాధించింది. ఆ స‌మ‌యంలో ఆసియా జోన్‌లోని క్వాలిఫ‌య‌ర్స్ పోటీల నుంచి బ‌ర్మా (మ‌య‌న్మార్‌), ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వైదొల‌గ‌డంతో భార‌త్‌కు నేరుగా అవ‌కాశం ల‌భించింది. అయితే.. ఈ మెగాటోర్నీలో మాత్రం భార‌త్ పాల్గొన‌లేదు.

ఎందుకు పాల్గొన‌లేదు అన్న దానిపై పూర్తి స‌మాచారం అయితే లేదు గానీ.. ప్రయాణ ఖర్చులు, తగిన సన్నాహకాలు లేకపోవడం వంటి కారణాలతో త‌ప్పుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌రువాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ ఒక్క‌సారి కూడా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా ఆడ‌లేదు. దాదాపు 10 ప్ర‌పంచ‌క‌ప్ అర్హ‌త పోటీల్లో పాల్గొన‌ప్ప‌టికి కూడా ఒక్క‌సారి కూడా క్వాలిఫై కాలేదు.

Fatima Sana : ఆ త‌ప్పు వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా స‌నా కామెంట్లు..

దేశంలో ఫుట్‌బాల్‌పై ప్ర‌స్తుతం రోజురోజుకూ ఆస‌క్తి పెరుగుతోంది. యువతలో ఈ ఆటకు ఆదరణ పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు, పటిష్టమైన గ్రాస్‌రూట్ వ్యవస్థ, నాణ్యమైన శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తే భవిష్యత్తులో భారత జ‌ట్టు ప్రపంచకప్ కలను సాకారం చేసుకునే అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.