First 12 spots for T20 World Cup 2028 decided after group stage play in 2026 edition
T20 World Cup 2028 : టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8కి చేరుకునే జట్లు ఏవో తేలిపోయాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ 2028కి అర్హత సాధించిన 12 జట్లను ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8కి అర్హత సాధించిన భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లలతో పాటు ఆతిథ్య దేశాలుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు టీ20 ప్రపంచకప్ 2028కి నేరుగా అర్హత సాధించాయని ఐసీసీ వెల్లడించింది.
వీటితో పాటు బంగ్లాదేశ్, ఐర్లాండ్, అఫ్గానిస్థాన్‌లు కూడా టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా తమ స్థానాలను దక్కించుకున్నాయి. అయితే వీటిని టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ ముగిసిన తరువాత అర్హత సాధించినట్లుగా ఐసీసీ ప్రకటించనుంది.
12 teams have punched their ticket for the ICC Men’s #T20WorldCup 2028 🎫
More ➡️ https://t.co/PeTqvtPWt0 pic.twitter.com/QTVapKCH9S
— ICC (@ICC) February 19, 2026
ఎందుకంటే టీ20 ర్యాంకింగ్స్‌కు కటాఫ్ తేదీని టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌గా నిర్ణయించారు. మార్చి 9 వరకు వీటి ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేసే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఏవీ లేకపోవడంతో ఈ మూడు జట్లు టీ20 ప్రపంచకప్ 2028కి అర్హత సాధించాయి.
టీ20 ప్రపంచకప్ 2028లో కూడా 20 జట్లు పాల్గొంటాయని ఐసీసీ తెలిపింది. మిగిలిన 8 జట్లను రాబోయే రెండేళ్లలో జరిగే క్వాలిఫయర్స్ ఆధారంగా నిర్ణయిస్తారు.
టీ20 ప్రపంచకప్ 2028కి అర్హత సాధించిన 12 జట్లు ఇవే..
* భారత్
* ఆస్ట్రేలియా
* న్యూజిలాండ్
* దక్షిణాఫ్రికా
* జింబాబ్వే
* వెస్టిండీస్
* ఇంగ్లాండ్
* పాకిస్థాన్
* శ్రీలంక
* బంగ్లాదేశ్
* అఫ్గానిస్థాన్
* ఐర్లాండ్