IND W vs AUS W : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడే తొలి టీ20.. మ్యాచ్ టైమింగ్, ఎక్కడ చూడొచ్చంటే?
భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటన (IND W vs AUS W) నేటి నుంచి ఆరంభం కానుంది.
First T20 match between India vs Australia Women today streaming details here
IND W vs AUS W : భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటన నేటి నుంచి ఆరంభం కానుంది. ఈపర్యటనలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, ఓ టెస్టు మ్యాచ్ ఆడనుంది. తొలుత టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత మహిళల జట్టు బరిలోకి దిగనుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు (ఆదివారం ఫిబ్రవరి15న) సిడ్నీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 ప్రారంభం కానుంది.
ఎక్కడ చూడొచ్చడంటే?
ఆస్ట్రేలియా, భారత మహిళల మధ్య జరగనున్న సిరీస్‌లకు సంబంధించిన హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ కలిగి ఉంది. ఈ క్రమంలో టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఇక ఓటీటీలో అయితే.. జియో హాట్ స్టార్ యాప్, వెబ్సైట్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – ఫిబ్రవరి 15న – సిడ్నీ
* రెండో టీ20 మ్యాచ్ – ఫిబ్రవరి 19న – కాన్ బెర్రా
* మూడో టీ20 మ్యాచ్ – ఫిబ్రవరి 21న – అడిలైడ్
వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే – ఫిబ్రవరి 24 న – గబ్బా
* రెండో వన్డే – ఫిబ్రవరి 27న – హోబర్ట్
* మూడో వన్డే – మార్చి 1 – హోబర్ట్
ఇక ఏకైక టెస్టు మ్యాచ్ మార్చి 6 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది.
భారత టీ20 జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ , రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి కమలిని, అరుంధతి రెడ్డి, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, శ్రేయంక పాటిల్.
