Ambati Rayudu: మారువేషంలో అంబటి రాయుడు అంపైరింగ్.. గుర్తుపట్టిన యువకులు ఏం చేశారో తెలుసా..? వీడియో వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మారువేషంలో అంపైరింగ్ చేశాడు.. అనంతరం బ్యాటింగ్ చేశాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Harishth Thanniru
- Published On : December 15, 2023 / 02:18 PM IST
Ambati Rayudu
Former cricketer Ambati Rayudu : టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్ అభిమానులతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని అందరికీ సుపరిచితమే. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఓ విచిత్రమైన వేషధారణలో అంపైర్ గా కొద్దిసేపు, బ్యాటింగ్ చేస్తూ కొద్దిసేపు యువకులతో క్రికెట్ ఆడాడు. చివరికి అంబటి రాయుడు అని గుర్తించిన ఆ యువ క్రికెటర్లు సంబరాలు చేసుకున్నారు.. రాయుడు ఆటో గ్రాఫ్ కోసం పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : IND vs SA T20 Match : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఉత్తమ ఫీల్డర్ పతకాన్నిఅందుకున్న హైదరాబాదీ క్రికెటర్..
విశాఖ గ్రేటర్ లోని రైల్వే స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ లో భాగంగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మారువేషంలో అంపైరింగ్ నిర్వహించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద పొట్ట, నెత్తిన టోపీ, పొడవాటి గడ్డంతో ఓ వృద్ధుడు వలే అంబటి రాయుడు తయారయ్యాడు. వికెట్ల వద్ద నిలుచొని అంపైరింగ్ చేశాడు. అయితే, మ్యాచ్ చివరి వరకు యువ క్రికెటర్లు ఎవరూ అంబటి రాయుడును గుర్తుపట్టలేదు. అంపైరింగ్ తో పాటు బ్యాటింగ్ సైతం చేశాడు. చివరికి అంబటి రాయుడు తన పొడవాటి గడ్డం, నెత్తిన టోపీని తొలగించడంతో యువకులు రాయుడుగా గుర్తుపట్టారు. దీంతో ఒక్కసారిగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాయుడుతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. కొందరు యువకులు ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. వారికి రాయుడు ఓపిగ్గా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అనంతరం యువ క్రికెటర్లతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read : Virat kohli : టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికాకు బయలుదేరిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
గ్రేటర్ లోని రైల్వే స్టేడియంలో మారువేషంలో అంబటి రాయుడు అంపైరింగ్ నిర్వహించారు. ఆట అనంతరం తెలుసుకున్న యువకులు.#AmbatiRayudu #AadudamAndhra #Vizag #UANow pic.twitter.com/8OhWUKTwEg
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) December 14, 2023
