Prashant Vaidya : చెక్ బౌన్స్ కేసులో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అరెస్ట్
చెక్ బౌన్స్ కేసులో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ప్రశాంత్ వైద్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
- Thota Vamshi Kumar
- Published On : January 31, 2024 / 09:33 PM IST
Former cricketer Prashant Vaidya arrested in cheque-bouncing case
నాగ్‌పూర్ : చెక్ బౌన్స్ కేసులో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ప్రశాంత్ వైద్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరు పరచగా వ్యక్తిగత పూచికత్తు మీద విడుదల చేశారు. ప్రశాంత్ ఓ వ్యాపారి నుంచి స్టీల్‌ను కొనుగోలు చేశాడని, సదరు వ్యాపారికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని బజాజ్ నగర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విఠల్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. పలువురు మార్లు నగదు చెల్లించాలని వ్యాపారి ప్రశాంత్‌ను కోరగా అందుకు అతడు నిరాకరించాడన్నారు.
దీంతో సదరు వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానంలో విచారణకు ప్రశాంత్ హాజరుకాకపోవడంతో కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. దీంతో పోలీసులు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచినట్లు వివరించారు.
IND vs ENG : రెండో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్.. టీమ్ఇండియా అదృష్టం మామూలుగా లేదుగా..!
ప్రశాంత్ వైద్య 1990లో టీమ్ఇండియా తరుపున నాలుగు వన్డే మ్యాచులు ఆడాడు. ప్రస్తుతం అతడు విదర్భ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నాడు.
