IND vs ENG : రెండో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌.. టీమ్ఇండియా అదృష్టం మామూలుగా లేదుగా..!

గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది.

IND vs ENG : రెండో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌.. టీమ్ఇండియా అదృష్టం మామూలుగా లేదుగా..!

England Spinner Jack Leach likely to miss second Test

India vs England : ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో భార‌త్ పై 28 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ స్పిన్న‌ర్ జాక్ లీచ్ రెండో టెస్టులో ఆడ‌డం అనుమానంగా మారింది. ఇంగ్లాండ్ జ‌ట్టు బుధ‌వారం విశాఖ‌లోని మైదానంలో నిర్వ‌హించిన ప్రాక్టీస్ సెష‌న్‌లో అత‌డు పాల్గొన‌లేదు.

తొలి టెస్టులో జాక్‌లీచ్‌ ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డాడు. బంతిని ఆపే క్ర‌మంలో అత‌డు డైవ్ చేయ‌డంతో మోకాలికి గాయమైంది. నొప్పితో విల‌విల‌లాడిన లీచ్ మ్యాచ్‌లో ఎక్కువ స‌మ‌యం డ్రెస్సింగ్ రూమ్‌కే ప‌రిమితం అయ్యాడు. స్ట్రాప్పింగ్ వేసుకుని నొప్పితోనే బౌలింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అత‌డు ఓ వికెట్ కూడా తీశాడు. అత‌డిగాయంపై ఇంగ్లాండ్ స్పిన్ కోచ్ జీతన్ పటేల్ మాట్లాడుతూ.. తాకిన చోటే రెండు సార్లు తాకడంతో గాయం తీవ్ర‌వ ఎక్కువ‌గా ఉంద‌న్నాడు. అయిన‌ప్ప‌టికీ తొలి టెస్టులో అత‌డు అద్భుతంగా బౌలింగ్ చేశాడ‌ని మెచ్చుకున్నాడు.

ICC Test Rankings : దుమ్ములేపిన పోప్‌.. అశ్విన్‌, జ‌డేజా టాప్‌.. కోహ్లీ, రోహిత్ ఎక్క‌డంటే..?

కాగా.. గాయం నుంచి జాక్‌లీచ్ పూర్తిగా కోలుకోలేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అత‌డు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడు. అందుక‌నే బుధ‌వారం ప్రాక్టీస్ సెష‌న్‌కు సైతం ఆడ‌లేదు. రెండో టెస్టులో అత‌డు ఆడ‌క‌పోతే అది ఇంగ్లాండ్ ప్ర‌ణాళిక‌ల‌ను దెబ్బ‌తీసే అవ‌కాశం. ఇంగ్లాండ్ జ‌ట్టులోని స్పిన్న‌ర్ల‌లో అత‌డే సీనియ‌ర్ ఆట‌గాడు.

కాగా.. రెండో టెస్టు మ్యాచ్‌కు అతిథ్యం ఇస్తున్న విశాఖ మైదానం స్పిన్‌కు అనుకూలం అనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో న‌లుగురు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగుతామ‌ని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ తెలిపాడు. ఇప్పుడు సీనియ‌ర్ ఆట‌గాడైన లీచ్ దూరం కావ‌డం ఇంగ్లాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ కానుంది. అత‌డి స్థానంలో యువ ఆట‌గాడు షోయ‌బ్ బ‌షీర్ అరంగ్రేటం చేసే అవ‌కాశం ఉంది. వీసా స‌మ‌స్య‌ల కార‌ణంగా అత‌డు మొద‌టి టెస్టు మ్యాచ్‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే.

Mayank Agarwal : టీమ్ఇండియా క్రికెట‌ర్‌ మ‌యాంక్ అగ‌ర్వాల్‌కు ఏమైంది? హానిక‌ర ద్ర‌వం ఎందుకు తాగాడంటే?