ICC Test Rankings : దుమ్ములేపిన పోప్.. అశ్విన్, జడేజా టాప్.. కోహ్లీ, రోహిత్ ఎక్కడంటే..?
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు ఒలీపోప్ అదరగొట్టాడు.
ICC Test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు ఒలీపోప్ అదరగొట్టాడు. ఉప్పల్ వేదికగా భారత్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో 278 బంతుల్లో 21 బౌండరలు బాది 196 పరుగులు చేసిన పోప్ తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌ల్లో 20 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. అతడి కెరీర్‌తో ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచులో హాఫ్ సెంచరీతో రాణించిన ఉస్మాన్ ఖవాజా 2 స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఇక భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ ఓ స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. టాప్-10లో కోహ్లీ ఒక్కడే ఉన్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 12, ఏడాదిన్నర ఆటకు దూరంగా పంత్ 13వ స్థానంలో ఉన్నారు.
టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-5 ఆటగాళ్లు వీరే..
1.కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 864 రేటింగ్ పాయింట్లు
2.జో రూట్ (ఇంగ్లండ్) – 832
3.స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 818
4.డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – 786
5.బాబర్ ఆజం (పాకిస్తాన్) – 768
Also Read: యాంకర్‌తో శిఖర్ ధావన్.. మీరు నన్ను ఆకర్షించారా..?
అశ్వినే టాప్..
టెస్టు బౌలర్ల ర్యాంకింగ్‌లో భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 853 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అర డజను వికెట్లు తీసిన పేసర్ బుమ్రా ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని నాలుగో స్థానంలో రవీంద్ర జడేజా ఆరో స్థానంలో నిలిచారు.
టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో టాప్-5 ఆటగాళ్లు వీరే
1.రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా) – 853 రేటింగ్ పాయింట్లు
2.కగిసో రబడ (సౌతాఫ్రికా) – 851
3.పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 828
4.జస్ప్రీత్ బుమ్రా (భారత్) – 825
5.జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 818
ఇక ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే.. 425 రేటింగ్ పాయింట్లతో టీమ్ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత వరుసగా రవిచంద్రన్ అశ్విన్, షకీబ్ అల్ హసన్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
Also Read: టీమ్ఇండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌కు ఏమైంది? హానికర ద్రవం ఎందుకు తాగాడంటే?
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ లో టాప్ -5 ఆటగాళ్లు వీరే..
1.రవీంద్ర జడేజా (భారత్) – 425 రేటింగ్పాయింట్లు
2.రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 328
3.షకీబ్ అల్హసన్ (బంగ్లాదేశ్) – 320
4.జో రూట్ (ఇంగ్లాండ్) – 313
5.బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) – 307
Big movers on the latest ICC Men’s Test Player Rankings following an epic first #WTC25 contest between India and England 😯
Details 👇https://t.co/K5ZRhCekVd
— ICC (@ICC) January 31, 2024