Shikhar Dhawan : యాంక‌ర్‌తో శిఖ‌ర్ ధావ‌న్‌.. మీరు న‌న్ను ఆక‌ర్షించారా..?

టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు శిఖ‌ర్ ధావ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంలో గ‌త కొంత‌కాలంగా ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటున్నాడు.

Shikhar Dhawan : యాంక‌ర్‌తో శిఖ‌ర్ ధావ‌న్‌.. మీరు న‌న్ను ఆక‌ర్షించారా..?

Shikhar Dhawan’s cheeky pun for anchor Karishma Mehta

Dhawan : టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు శిఖ‌ర్ ధావ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంలో గ‌త కొంత‌కాలంగా ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటున్నాడు. భార్య‌తో విడాకులు తీసుకోవ‌డంతో కొడుకుకు దూరం కావాల్సి వ‌చ్చింది. ఇంకోవైపు భార‌త జ‌ట్టులో అత‌డికి చోటు ద‌క్క‌డం లేదు. ఈ క్ర‌మంలో త‌న వ్య‌క్తిగ‌త జీవితం, క్రికెట్ వ్య‌హ‌రాల‌పై ఇటీవ‌ల వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ధావ‌న్ ను హ్యూమ‌న్స్ ఆఫ్ బాంబే పాడ్‌కాస్ట్ ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్‌తో ధావ‌న్ మాట్లాడిన కొన్ని మాట‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

యాంక‌ర్ కరిష్మా మెహతా ఆకర్ష‌ణ సిద్ధాంతం పై మాట్లాడుతూ త‌న‌కు దీనిపై పూర్తిగా న‌మ్మ‌కం ఉంద‌ని చెప్పింది. ఈ ఇంట‌ర్వ్యూకు ముందు కూడా ఇదే అంశంపై ఇటీవ‌ల నిర్వ‌హించిన వ‌ర్క్‌షాప్‌లో సైతం పాల్గొన్న‌ట్లు తెలిపింది. దీనిపై ధావ‌న్ స్పందించాడు. మీరు న‌న్ను ఆక్ష‌రించారా..? అని ఫ‌న్నీగా అడిగాడు. అవును అది ఖ‌చ్చితంగా నిజం ఇంట‌ర్య్వూ కోసం ఆకర్షించా అని యాంక‌ర్ చెప్పింది.

Mayank Agarwal : టీమ్ఇండియా క్రికెట‌ర్‌ మ‌యాంక్ అగ‌ర్వాల్‌కు ఏమైంది? హానిక‌ర ద్ర‌వం ఎందుకు తాగాడంటే?

అక్క‌డితో ఈ సంభాష‌న‌ను ముగించి ధావ‌న్.. స‌చిన్ టెండూల్క‌ర్ నుంచి తాను నేర్చుకున్న విష‌యాల‌ను వివ‌రించాడు. ఆట ప‌ట్ల ప్రేమ‌, నిబ‌ద్ధ‌త‌, నైపుణ్యాల‌ను ఎలా సాధించాల‌నేది స‌చిన్ టెండూల్క‌ర్ నుంచి నేర్చుకున్న‌ట్లు చెప్పాడు. స‌చిన్‌కున్న అవ‌గాహ‌న అమోగం అన్నాడు. బ్యాట్‌ను ఎలా వినియోగించాలో, ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలి, శ‌త‌కాన్ని ఎలా సాధించాల‌నేది అత‌డి నుంచి నేర్చుకోవాల‌ని ధావ‌న్ అన్నాడు.

ధావ‌న్ టీమ్ఇండియా త‌రుపున 34 టెస్టులు, 167 వ‌న్డేలు, 68 టీ20 మ్యాచులు ఆడాడు. 34 టెస్టుల్లో 40.6 స‌గ‌టుతో 2315 ప‌రుగులు చేశాడు. ఇందులో 7 సెంచ‌రీలు, 5 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 167 వ‌న్డేల్లో 44.1 స‌గ‌టుతో 6793 ప‌రుగులు చేశాడు. ఇందులో 17 శ‌త‌కాలు, 39 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. 68 టీ20 మ్యాచుల్లో 27.9 స‌గ‌టుతో 1759 ప‌రుగులు చేశాడు. ఐపీఎల్‌లో 217 మ్యాచుల్లో 35.4 స‌గ‌టుతో 6617 ప‌రుగులు చేశాడు.

Virat Kohli : మీడియాపై విరాట్ కోహ్లీ బ్ర‌ద‌ర్‌ ఆగ్ర‌హం.. మా అమ్మకు ఏం కాలేదు

టీమ్ఇండియాలో ధావ‌న్‌కు ప్ర‌స్తుతం అవ‌కాశాలు రావ‌డం లేదు. ఐపీఎల్ మాత్ర‌మే ఆడుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు అత‌డు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.