SL Akshay : క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం.. బెంగ‌ళూరులో మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో క్రికెట‌ర్ మృతి..

క్రికెట్‌ ప్ర‌పంచంలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ మాజీ ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట‌ర్ ఎస్ఎల్ అక్ష‌య్ (SL Akshay) గుండెపోటుతో మ‌ర‌ణించాడు.

former first class cricketer SL Akshay dies during match

SL Akshay : క్రికెట్‌ ప్ర‌పంచంలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ మాజీ ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట‌ర్ ఎస్ఎల్ అక్ష‌య్ గుండెపోటుతో మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న‌తో ఆట‌గాళ్లు, అధికారులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు.

శివమొగ్గకు చెందిన 39 ఏళ్ల అక్ష‌య్‌ బెంగళూరులోని కేఆర్ పురంలో ఆదివారం మధ్యాహ్నం మూడో డివిజన్ లీగ్ మ్యాచ్ ఆడుతూ కుప్ప‌కూలిపోయాడు. ఫీల్డింగ్ చేస్తుండ‌గా అత‌డి ఛాతీలో అసౌక‌ర్యంగా ఉంద‌ని చెబుతూ కింద‌ప‌డిపోయాడు. వెంట‌నే అత‌డిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత‌డిని ప‌రీక్షించిన వైద్యులు అత‌డు చ‌నిపోయిన‌ట్లు వెల్ల‌డించారు.

Kieron Pollard : హార్దిక్ పాండ్యాకు అన్నీ ఇచ్చాము.. కానీ.. కీర‌న్ పొలార్డ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

‘క‌ర్ణాట‌క మాజీ పేస‌ర్ అక్ష‌య్ మృతి ప‌ట్ల భార‌త మాజీ క్రికెట‌ర్ దొడ్డ గ‌ణేష్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. క్రికెట్ ప్రపంచానికి ఇది అత్యంత బాధాకరమైన వార్త. నేను అతడిని అండర్-19 రోజుల నుండి చూశాను. 39 ఏళ్ల ఈ పేస‌ర్ ఒక డివిజన్ మ్యాచ్ ఆడుతూ కన్నుమూశారు. మృదుభాషి అయిన ఆ వ్యక్తి ఇక లేరు. అక్షయ్ ఆత్మకు శాంతి చేకూరాలి.’ అని దొడ్డ గ‌ణేష్ తెలిపారు.

Riyan Parag : మ‌మ్మ‌ల్ని ఇంటికి పోకుండా కాపాడింది అత‌డే.. రియాన్ ప‌రాగ్ హాట్ కామెంట్స్‌..

కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అక్షయ్‌కు నివాళులర్పిస్తూ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కర్ణాటక క్రికెట్‌కు ఆయన చేసిన సేవలను సంఘం ప్రశంసించింది. పదవీ విరమణ తర్వాత కోచ్‌గా రాష్ట్రవ్యాప్తంగా యువ ఆటగాళ్లను అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించింది.