Shahid Afridi Slapped Mohammad Amir After spot fixing
Shahid Afridi : పాకిస్థాన్ క్రికెటర్ల మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం 2010లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. లార్డ్స్‌లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ పేసర్లు అహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్ ఉద్దేశపూర్వకంగానే నో-బాల్స్ వేశారు. బుక్‌మేకర్ మజార్ మజీద్‌తో ముందే నిర్ణయించిన సమయంలో టెస్టు కెప్టెన్ సల్మాన్ బట్ రూపొందించిన ఈ ప్లాన్ న్యూస్ ఆఫ్ ది వరల్డ్‌స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపడింది. ఆ సమయంలో సల్మాన్ బట్, మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అమీర్‌లపై నిషేధం పడింది. అయితే, తాజాగా. ఆ విషయంపై పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ కీలక విషయాలను వెల్లడించారు.
Also Read : Acid Rain In Iran : ఇరాన్ పై యాసిడ్ వర్షం.. ఇది జనం శరీరం మీద పడితే..
రజాక్ ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. మ్యాచ్ ఫిక్సింగ్ సమయంలో ఏం జరిగిందనే విషయాలను వెల్లడించారు. తనకు లండన్లో ఫోన్లు రిపేర్ చేసే ఒక స్నేహితుడు ఉన్నాడు. దీనితో యాదృచ్చికంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మజార్ మజీద్ నా స్నేహితుడి దగ్గరికి వచ్చి తన ఫోన్లో ఒకదాన్ని రిపేరు చేయమని అడిగాడు. నా స్నేహితుడు రాత్రి ఆలస్యంగా ఫోన్ రిపేర్ చేస్తున్నప్పుడు.. మజార్, ముగ్గురు ఆటగాళ్ల మధ్య మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ ప్రణాళికలను వివరించే అనేక సందేశాలు కనిపించాయని రజాక్ వివరించారు. ఆ సందేశాల గురించి తన స్నేహితుడు తనకు తెలియజేశాడని, ఆ సమాచారాన్ని అప్పటి కెప్టెన్ అఫ్రీదికి ఫార్వర్డ్ చేశాడని రజార్ తెలిపాడు.
షాహిద్ అఫ్రీదికి మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం తెలిసిన వెంటనే.. 18ఏళ్ల వయసున్న మహ్మద్ అమీర్‌ను తన గదికి పిలిపించాడు. ఆ సమయంలో అమీర్‌ను తాను వెంటపెట్టుకొని అఫ్రిది గది వద్దకు వెళ్లాను. అతను నన్ను బయటనే ఉండమని.. అమీర్‌ను లోపలికి పిలిచాడు. అఫ్రిది కోపంతో నిజం చెప్పమని అమీర్‌ను అడగడం నేను బయట నుంచి విన్నాను. అతను నాకేమీ తెలియదు అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో అఫ్రిది కోపంతో అమీర్ చెంపచెల్లుమనిపించాడని, ఆ సౌండ్ విని నేను వెంటనే లోపలికి వెళ్లాను. ఆ తరువాత అమీర్ కన్నీళ్లు పెట్టుకొని నిజం ఒప్పుకున్నాడని రజాక్ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తరువాత బట్, ఆసిఫ్ మళ్లీల పాక్ క్రికెట్లో అడుగుపెట్టలేదు. అమీర్ 2024లో రిటైర్ అయ్యేముందు 2016లో అంతర్జాతీయ క్రికెట్ జట్టులో తిరిగి చేరాడు.