Former Pakistan cricketer Ahmed Shehzad In Epic Meltdown After Indias T20 World Cup Glory
T20 World Cup 2026 : భారత జట్టు ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆదివారం నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సగర్వంగా కప్పును ముద్దాడింది. తొలుత బ్యాటింగ్‌లో 255 పరుగులు చేసిన భారత్.. ఆ తరువాత న్యూజిలాండ్‌ను 159 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలోనే భారత జట్టు అనేక రికార్డులను సాధించింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక పాక్ మాజీ ఆటగాళ్లు కూడా భారత జట్టును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అదే సమయంలో తమ దేశ క్రికెట్ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు.
ఓ ఛానల్‌లో చర్చా కార్యక్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ భారత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్లుగా ఎలా మారారో అతడు హైలెట్ చేశాడు.
‘పాక్‌లో చాలా ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నారు. అయితే.. లోపం మన వ్యవస్థలోనే ఉంది. భారతదేశంలో ఏముంది? అక్కడ ప్రతిభ, వ్యవస్థ రెండూ ఉన్నాయి. అందుకనే అక్కడ అద్భుతమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. ఉదాహరణకు సంజూ శాంసన్‌ను తీసుకోండి. అతడికి రెగ్యులర్‌గా అవకాశాలు రావు. అయినప్పటికి కూడా అతడు ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక అయ్యాడు. క్రమశిక్షణ లేదని ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టేశారు. అతడు దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన తరువాతనే జట్టులోకి వచ్చాడు. ఫైనల్ మ్యాచ్‌లోనూ అర్థశతకంతో సత్తా చాటాడు. ఇక అభిషేక్ శర్మ అయితే.. ఎంతో ఒత్తిడిలో ఉన్నాడు. అయినప్పటికి ఫైనల్‌లో అతడు 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు.’ అహ్మద్ షెహజాద్ అన్నాడు.
మంచి జట్టు సరైన సమయంలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. వారు (భారత్) 250 పరుగులు చేస్తారు. మేము అక్కడ ఉంటే 180 పరుగులు చేసే వాళ్లం. ఆ తరువాత 180 పరుగులను డిఫెండ్ చేయాలని బౌలర్లకు చెప్పేవాళ్లం. కానీ వాళ్లు అలా చేయరు. అని షెహజాద్ తెలిపాడు.
ఇక పాకిస్థాన్ ఏ స్థాయి క్రికెట్ ఆడుతుందో మీరు గమనిస్తున్నారా? జింబాబ్వే, కెన్యా, ఉగాండా వంటి జట్లను పిలిచి వారిపై గెలిచి సంబరాలు చేసుకుంటారని విమర్శించాడు. పాకిస్థాన్‌కు ఐసీసీ ప్రత్యేక ర్యాంకింగ్స్ వ్యవస్థను ప్రవేశపెడితే బాగుంటుందని అన్నాడు. ఈ ర్యాంకింగ్స్‌లో పాక్ జట్టు.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి అగ్ర శేణి జట్టతో కాకుండా జింబాబ్వే, కెన్యా, ఉగాండా వంటి వాటితోనే పోటీ పడుతుందన్నాడు.
🚨 Ahmed Shehzad takes a BRUTAL dig at Pakistan after India’s world cup triumph
“India is at the top because they prepare themselves against top teams. Pakistan, on the other hand, is content with playing Zimbabwe, Uganda, and Kenya. In fact, I think we should have new rankings… pic.twitter.com/tLkgcMSMZr
— Brutal Truth (@sarkarstix) March 8, 2026
మొత్తంగా అతడు టీమ్ఇండియాతో పాటు భారత దేశవాళీ వ్యవస్థను హైలెట్ చేస్తూ.. పాక్ దేశవాళీ క్రికెట్, పీసీబీ పై విమర్శల వర్షం కురిపించాడు.