Basit Ali : పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌కు తీవ్ర గుండెపోటు..
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ (Basit Ali) గుండెపోటుకు గురి అయ్యారు.
- Thota Vamshi Kumar
- Updated on- August 17, 2026 / 04:31 PM IST
Former pakistani cricketer Basit Ali suffered heart attack
Basit Ali : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ గుండెపోటుకు గురి అయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను కరాచీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
యాంజియోప్లాస్టీ అనేది గుండెలోని ఇరుకైన లేదా మూసుకుపోయిన ధమనులను వెడల్పు చేయడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. ఇందులో క్యాథెటర్, బెలూన్‌ను ఉపయోగించి ధమనిలో పేరుకుపోయిన కొవ్వును తొలగించి రక్తప్రసరణను మెరుగుపరుస్తారు. అవసరమైతే రక్తనాళం తెరిచి ఉంచేందుకు స్టెంట్‌ను అమర్చుతారు.
Our beloved Basit ali is going through angioplasty we wish him successful procedure and speedy recovery…please keep him in your thoughts and prayers 🙏 pic.twitter.com/vkUoaTF8Sh
— Najeeb ul Hasnain (@ImNajeebH) August 17, 2026
బాసిత్ అలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆకాంక్షిస్తున్నారు.
55 ఏళ్ల బాసిత్ అలీ 22 ఏళ్ల వయసులో పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. తన బ్యాటింగ్ శైలితో ఆయనను అప్పట్లో పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ జావెద్ మియాందాద్‌తో పోల్చేవారు. ముఖ్యంగా వేగంగా బౌలింగ్ చేసే బౌలర్లపై బాసిత్ అలీ ధైర్యంగా షాట్లు ఆడేవారు. అయితే.. ఆయనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతడి ప్రతిష్ట దెబ్బతింది.
పాకిస్థాన్ తరఫున బాసిత్ అలీ 19 టెస్టులు ఆడి 33 ఇన్నింగ్స్‌లలో 858 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. 50 వన్డేల్లో 1,265 పరుగులు సాధించారు. ఇందులో ఓ సెంచరీ, తొమ్మిది అర్ధసెంచరీలు ఉన్నాయి.
