×
Ad

Gautam Gambhir : భార‌త జ‌ట్టును వ‌దిలి స‌చిన్ కొడుకు పెళ్లికి వెళ్లిన గౌత‌మ్ గంభీర్..! ఇంగ్లాండ్‌తో కీల‌క సెమీస్ మ్యాచ్‌కు ముందు..

ముంబైలో జ‌రిగిన అర్జున్ టెండూల్క‌ర్, సానియా చందోక్‌ల పెళ్లికి టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir ) హాజ‌రు అయ్యాడు.

Gautam Gambhir Attends Arjun Tendulkar Wedding Ahead Of T20 World Cup 2026 IND vs ENG semis match

  • ఘ‌నంగా అర్జున్ టెండూల్క‌ర్, సానియా చందోక్‌ల పెళ్లి
  • వివాహానికి హాజ‌రైన టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్‌
  • సాయంత్రం భార‌త్, ఇంగ్లాండ్‌ల‌ మ‌ధ్య‌ సెమీస్ మ్యాచ్‌

Gautam Gambhir : టీమ్ఇండియా క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ వివాహం సానియా చందోక్‌తో ముంబైలో గురువారం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది. వీరికి పెళ్లికి సినీ, రాజ‌కీయ‌, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు అయ్యారు. టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ సైతం అర్జున్ పెళ్లికి హాజ‌రు అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా జ‌ర‌గ‌నున్న సెమీస్ మ్యాచ్‌లో భారత్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7 గంట‌ల‌కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ కీల‌క మ్యాచ్‌కు కొన్ని గంట‌ల ముందు భార‌త జ‌ట్టును వ‌దిలి స‌చిన్ కొడుకు పెళ్లికి గంభీర్ హాజ‌రు అవ్వ‌డం పై కొంద‌రు మండిప‌డుతున్నారు.

T20 World Cup 2026 : ఎంత ప‌ని చేశావుర‌య్యా.. డికాక్ చేసిన ఒక్క మిస్టేక్‌.. ప్ర‌పంచ‌క‌ప్ నుంచి సౌతాఫ్రికా ఔట్‌.. !

కాగా.. గంభీర్ మాత్ర‌మే కాద‌ని ప‌లువురు టీమ్ఇండియా ఆట‌గాళ్లు సైతం అర్జున్ పెళ్లికి హాజ‌రు అయిన‌ట్లుగా స‌మాచారం. అయితే.. ఇందుకోసం వీరేమీ ప్ర‌త్యేకంగా ప్ర‌యాణించ‌లేద‌ని తెలుస్తోంది. భార‌త జ‌ట్టు బ‌స చేస్తున్న హోట‌ల్‌లోనే వివాహ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డంతో వీరంతా పెళ్లికి వెళ్లిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఫైన‌ల్ చేరుకోవాల‌ని భార‌త జ‌ట్టు ఆరాట‌ప‌డుతోంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ లో భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు సెమీఫైన‌ల్ మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఓవ‌రాల్‌గా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు ఐదు సార్లు ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్ మూడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

IND vs ENG : వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దైతే.. భార‌త్, ఇంగ్లాండ్‌ల‌లో ఫైన‌ల్ చేరుకునేది ఎవ‌రు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఇక ఓవ‌రాల్‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు టీ20ల్లో 29 సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 17 సార్లు భార‌త జ‌ట్టు విజ‌యం సాధించ‌గా, 12 సార్లు ఇంగ్లాండ్ గెలుపొందింది. ముంబైలోని వాంఖ‌డే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం అని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మ్యాచ్‌లో భారీ స్కోర్లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది.