Gautam Gambhir : అఫీషియల్ : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్..
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 9, 2024 / 08:32 PM IST
Gautam Gambhir has officially replaced Rahul Dravid as Indias head coach
Gautam Gambhir : గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలే నిజం అయ్యాయి. టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గంభీర్ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని జై షా చెప్పారు.
‘భారత క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. ఈ మార్పు ప్రక్రియలను గంభీర్ చాలా దగ్గర నుంచి చూశాడు. తన కెరీర్లో ఎన్నో కష్టాలను తట్టుకుని వివిధ పాత్రల్లో రాణించాడు. భారత క్రికెట్‌ను ముందుకు నడిపించడానికి గౌతమ్ ఆదర్శవంతమైన వ్యక్తి అని నాకు నమ్మకం ఉంది. టీమ్ఇండియా పట్ల అతని అవగాహన, ముందుచూపు అద్భుతం. టీమ్ఇండియాను మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా సమర్థవంతంగా కోచింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తాడని నమ్ముతున్నాను. బీసీసీఐ అన్ని విధాలుగా అతడికి అండగా ఉంటుంది.’ అని జై షా అన్నారు.
టీ20 ప్రపంచకప్ 2024 ముగియడంతో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త కోచ్‌గా గంభీర్‌ను బీసీసీఐ ప్రకటించింది. శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గంభీర్ బాధ్యతలను చేపట్టనున్నట్లు సమాచారం. అతడికి బీసీసీఐ పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఈ క్రమంలో తనకు ఇష్టమైన వారిని సహాయక కోచ్‌లుగా గంభీర్ తెచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా గంభీర్ డిసెంబర్ 31, 2027 వరకు బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
ICC Player of the Month : ఐసీసీ అవార్డుల్లో టీమ్ఇండియా ప్లేయర్ల హవా.. అటు మంధాన, ఇటు బుమ్రా..
