Gautam Gambhir : లక్నోకు గుడ్ బై.. తిరిగి సొంత గూటికి గౌతమ్ గంభీర్
Gautam Gambhir Quits LSG : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- November 22, 2023 / 03:16 PM IST
Gautam Gambhir Quits LSG
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ బై చెప్పాడు. ఇప్పటి వరకు లక్నోకు మెంటార్‌గా గంభీర్ వ్యవహరిస్తుండగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరనున్నాడు. ఈ విషయాన్ని గౌతమ్ గంభీర్ స్వయంగా వెల్లడించాడు. లక్నోను వీడడంపై సోషల్ మీడియాలో గంభీర్ భావోద్వేగ లేఖను పోస్ట్ చేశాడు.
‘లక్నో సూపర్ జెయింట్స్‌తో నా ప్రయాణం ముగిసింది. ఈ అద్భుతమైన ప్రయాణంలో అండగా నిలిచిన ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్టింగ్ సిబ్బంది అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండగా నిలిచిన ప్రాంఛైజీ యజమాని డా.సంజీవ్ గోయెంకాకు కృతజ్ఞతలు. లక్నో జట్టు భవిష్యత్తులో అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్క లక్నో అభిమాని గర్వించేలా జట్టు ప్రదర్శన ఉంటుందని ఆశిస్తున్నట్లు .’గంభీర్ ఎక్స్‌లో తెలిపాడు.
Virat Kohli : కోహ్లీ మూడు, రోహిత్ నాలుగు.. వన్డేల్లో ఆధిపత్యం మామూలుగా లేదుగా..
కోల్‌కతా నైట్ రైడర్స్ కు కొన్నాళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు గౌతమ్ గంభీర్. అతడి నాయకత్వంలో కేకేఆర్ 2012, 2014 సీజన్లలలో ఐపీఎల్ విజేతగా నిలిచింది. ప్లేయర్‌గా రిటైర్ అయిన తరువాత కొన్నాళ్ల పాటు కేకేఆర్‌కు మెంటార్‌గా పని చేశాడు. రెండు సంవత్సరాల క్రితం కేకేఆర్ విడిచిపెట్టిన గంభీర్ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు. అతడి మార్గనిర్దేశంలో లక్నో 2022లో ఐపీఎల్ ఫైనల్‌కు చేరగా, 2023లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
Amelia Kerr : టవల్‌తో బంతిని పట్టుకుంది.. భారీ మూల్యం చెల్లించుకుంది.. వీడియో వైరల్
అటు కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా గంభీర్ ఆత్మీయ స్వాగతం పలికింది. వచ్చే సీజన్ నుంచి గంభీర్ కోల్‌కతాకు మెంటార్‌గా సేవలు అందించనున్నాడు.
