Amelia Kerr : ట‌వ‌ల్‌తో బంతిని ప‌ట్టుకుంది.. భారీ మూల్యం చెల్లించుకుంది.. వీడియో వైర‌ల్‌

Amelia Kerr catches ball with towel : ఫీల్డ‌ర్ విసిరిన త్రోను చేతిలోని ట‌వ‌ల్ సాయంతో బౌల‌ర్ అందుకునే ప్ర‌య‌త్నం చేసింది.

Amelia Kerr : ట‌వ‌ల్‌తో బంతిని ప‌ట్టుకుంది.. భారీ మూల్యం చెల్లించుకుంది.. వీడియో వైర‌ల్‌

Amelia Kerr catches ball with towel

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడూ కొన్ని వింత ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క్రికెట్ చ‌రిత్ర‌లో ఇలాంటి ఘ‌ట‌న ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఫీల్డ‌ర్ విసిరిన త్రోను చేతిలోని ట‌వ‌ల్ సాయంతో బౌల‌ర్ అందుకునే ప్ర‌య‌త్నం చేసింది. దీన్ని గ‌మ‌నించిన అంపైర్ ఫీల్డింగ్ జ‌ట్టుకు షాకిచ్చాడు. అలా చేసినందుకు గాను బ్యాటింగ్ టీమ్‌కు ఐదు ప‌రుగులు అద‌నంగా ఇచ్చాడు. దీంతో బ్యాటింగ్ జ‌ట్టు ఈజీగా మ్యాచ్ గెలిచింది. ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళ‌ల బిగ్‌బాష్ లీగ్‌(బీబీఎల్‌)లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఏం జ‌రిగిందంటే..?

బీబీఎల్ 2023లో భాగంగా 49వ మ్యాచ్‌లో మంగ‌ళ‌వారం బ్రిస్పేన్ హీట్, సిడ్నీ సిక్స‌ర్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. బ్రిస్బేన్ హీట్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. అమీలియా కెర్ 44 బంతుల్లో 64 ప‌రుగులు, మిగ్నాన్ డు ప్రీజ్ 27 బంతుల్లో 42 ప‌రుగులు, చార్లీ నాట్ 10 బంతుల్లో 29 ప‌రుగుల‌తో రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో బ్రిస్పేన్ హీట్ ఏడు వికెట్లు కోల్పోయి 176 ప‌రుగులు చేసింది.

ICC World Cup 2023: ప్రపంచ కప్ తరువాత బంగ్లాదేశ్ కెప్టెన్ పై దాడి..! వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే?

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌కు సిడ్నీ సిక్స‌ర్ దిగింది. సిడ్నీ ఇన్నింగ్స్ ప‌దో ఓవ‌ర్‌ను అమెలియా కేర్ వేసింది. మొద‌టి బంతిని వేయ‌గా బ్యాట‌ర్ గార్డ్‌నర్ లాంగ్ ఆన్ దిశ‌గా బంతిని ఆడింది. అక్క‌డ ఉన్న ఫీల్డ‌ర్ బంతిని అందుకుని బౌల‌ర్‌ అమెలియా కేర్‌కు వైపు విసిరింది. అప్ప‌టికే వికెట్ల వ‌ద్ద ఉన్న కేర్.. త‌న చేతిలో ట‌వ‌ల్ ఉంచుకునే బంతిని అందుకునే ప్ర‌య‌త్నం చేసింది.

పెనాల్టీ ఐదు ప‌రుగులు..

దీన్ని ప‌క్క‌నే ఉన్న ఫీల్డ్ అంఫైర్ గ‌మ‌నించాడు. వెంట‌నే ఫీల్డింగ్ జ‌ట్టుకు 5 ప‌రుగులు పెనాల్టీగా విధించాడు. అంటే.. బ్యాటింగ్ జ‌ట్టు స్కోరుకు ఐదు ప‌రుగులు అద‌నంగా క‌లిపారు. క్రికెట్ నిబంధ‌న 28.2.1 ప్రకారం.. ప్లేయ‌ర్లు మైదానంలో బంతిని వస్తువులతో అడ్డుకున్నా లేదంటే ప్లేయ‌ర్ల వ‌స్తువులను తాకి బంతి ఆగిపోయినా, లేదంటే గ‌మ‌నం మారినా పెనాల్టీ విధిస్తారు. వికెట్ కీపర్లు వాడే హెల్మెట్.. కింద పెట్టినప్పుడు బంతి తాకినా 5 పరుగులు పెనాల్టీగా విధిస్తారు అన్న సంగ‌తి తెలిసిందే.

కాగా.. కేర్ ఉద్దేశ‌పూర్వంగా బంతిని అందుకునే చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ నిబంధ‌న‌లు అతిక్ర‌మించ‌డంతో పెనాల్టీ విధించారు. ఈ పెనాల్టీ సిడ్నీ సిక్స‌ర్ కు బాగా క‌లిసివ‌చ్చింది. ల‌క్ష్యాన్ని సిక్స‌ర్ 19.5 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒక‌వేళ పెనాల్టీగా ఆ ఐదు ప‌రుగులు రాకుండా ఉండి ఉంటే ఫ‌లితం వేరేగా ఉండే అవకాశం ఉండేద‌ని ప‌లువురు క్రీడా విశ్లేష‌కులు అంటున్నారు. కాగా.. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ODI World Cup 2023 : మాజీ పాక్ ప్లేయర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మహ్మద్ షమీ

క్రికెట్‌ను చాన్నాళ్లుగా చూస్తున్నామ‌ని అయితే.. ఇలాంటి ఓ రూల్ ఉంద‌ని ఇప్పుడే తెలిసింద‌ని అంటున్నారు.