ODI World Cup 2023 : మాజీ పాక్ ప్లేయర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మహ్మద్ షమీ

ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన వెనుక కఠోర శ్రమ ఉందని షమీ చెప్పాడు. తెరవెనుక నేను పడినకష్టమే నా విజయానికి మంత్రమని అన్నాడు.

ODI World Cup 2023 : మాజీ పాక్ ప్లేయర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మహ్మద్ షమీ

Mohammed Shami

Mohammed Shami Slams Pakistan Cricketers: భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఏడు మ్యాచ్ లు మాత్రమే ఆడిన షమీ 24 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా ఓడిపోయినప్పటికీ టోర్నీలో షమీ అద్భుత ప్రదర్శనపై ప్రతీ ఒక్కరి నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా షమీ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంట్వ్యూలో అద్భుత ప్రదర్శనకు కారణాన్ని వివరిస్తూనే పాకిస్థాన్ మాజీ ప్లేయర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Also Read : ICC World Cup 2023: ప్రపంచ కప్ తరువాత బంగ్లాదేశ్ కెప్టెన్ పై దాడి..! వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే?

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజా చేసిన ఆరోపణలకు మహ్మద్ షమీ తప్పుబట్టారు. పాకిస్థాన్ టెలివిజన్ షోలో రజా మాట్లాడుతూ.. ఇండియా బౌలర్లపై విమర్శలు చేశారు. భారత్ పిచ్ లపై పరిస్థితులకు అనుగుణంగా టీమిండియా బౌలర్లు రాణించేందుకు ఐసీసీ భిన్నమైన బంతులను వారికి ఇచ్చిందని ఆరోపించాడు. రజా వ్యాఖ్యలను చాలా మంది క్రికెటర్లు తప్పుబట్టారు. పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ సైతం హసన్ రజా వ్యాఖ్యలను ఖండించాడు. తాజాగా ఈ అంశంపై మహ్మద్ షమీ స్పందించారు. పాక్ మాజీ ప్లేయర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Also Read : India vs Australia : ఆసీస్‌తో టీ20 సిరీస్‌.. చాహల్‌కు దక్కని చోటు.. లెగ్ స్పిన్నర్ రియాక్షన్ చూశారా?

ప్రపంచకప్ లో నేను ఆడనప్పుడుకూడా వింటూనే ఉన్నాను. ఆడటం మొదలు పెట్టినప్పుడు ఐదు వికెట్లు తీశారు. తరువాతి మ్యాచ్ లో నాలుగు వికెట్లు, తరువాతి మ్యాచ్ లో ఐదు వికెట్లు తీశాను. కానీ, కొందరు పాక్ ఆటగాళ్లు జీర్ణించుకోలేక పోయారు. దానికి నేనేం చెయ్యగలను. పాక్ ఆటగాళ్లు వారి మనస్సులో వారు మేము అత్యుత్తమం అని అనుకుంటారు. సరియైన సమయంలో ప్రదర్శన చేసే ఆటగాళ్లే అత్యుత్తమం అవుతారని నేను భావిస్తాను. కానీ, వారు వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని షమీ అన్నారు.

Also Read : ICC Bans Transgender : అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ ప్లేయర్స్ పై ఐసీసీ నిషేధం.. ఎందుకంటే?

ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన వెనుక కఠోర శ్రమ ఉందని షమీ చెప్పాడు. తెరవెనుక నేను పడినకష్టమే నా విజయానికి మంత్రమని షమీ చెప్పాడు. ప్రపంచ కప్ లో నేను చేసిన పనిని మరెవరైనా చేస్తే నేను అసూయపడను. అత్యుత్తమ బౌలర్లు దశలవారిగా తమ స్థాయిని పెంచుకుంటూ వెళ్తారని పాక్ మాజీ ప్లేయర్ కు షమీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.