Shubman Gill : బౌండరీతో గిల్ సెంచరీ.. అతడి తండ్రి ఇచ్చిన రియాక్షన్ వైరల్.. వీడియో
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- March 8, 2024 / 12:43 PM IST
Gill reaches his 100 with boundary draws unique reaction from his father
Shubman Gill father : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 137 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మూడు అంకెల స్కోరును అందుకున్నాడు. కాగా.. టెస్టుల్లో అతడికి ఇది నాలుగో సెంచరీ కాగా.. ఈ సిరీస్‌లో రెండోది.
ఇక తన అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో) 11వ సెంచరీ. ఈ మ్యాచ్‌లో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి గిల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తనదైన శైలిలో సంబురాలు చేసుకున్నాడు. కాగా.. కొడుకు సెంచరీ చేయడాన్ని మైదానంలోంచి ప్రత్యక్షంగా వీక్షించిన గిల్ తండ్రి ఆనందంతో చప్పట్లు కొట్టాడు. విజయ గర్వంతో పిడికిలి బిగించి తన రెండు చేతులను పైకి ఎత్తడం కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Rohit Sharma : శతక్కొట్టిన రోహిత్ శర్మ.. సెంచరీ నంబర్ 48.. జోరూట్ రికార్డ్ బ్రేక్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గిల్(101)తో పాటు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(102) సైతం శతక్కొట్టడంతో రెండో రోజు లంచ్ విరామానికి భారత్ వికెట్ నష్టపోయి 264 పరుగులు చేసింది. గిల్-రోహిత్ జోడి అభేద్యమైన రెండో వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
Sachin Tendulkar : బిగ్‌బాస్ విన్నర్ చేతిలో ఔటైన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్
