Glenn Maxwell : తప్పతాగి పడిపోయిన మాక్స్వెల్..! అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!
ఓ పబ్‌లో తప్పతాగి పడిపోవడంతో మాక్స్‌వెల్‌ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకుని వెళ్లాల్సి వచ్చిందట.
- Thota Vamshi Kumar
- Updated on- January 22, 2024 / 08:11 PM IST
Glenn Maxwell
Glenn Maxwell hospitalised : ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఆసీస్ ఆటగాడిగానే కాక ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరుపున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మెరుపు వేగంతో డబుల్ సెంచరీ చేశాడు. అయితే.. తాజాగా అతడు ఓ వివాదంలో చిక్కుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ పబ్‌లో తప్పతాగి పడిపోవడంతో అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకుని వెళ్లాల్సి వచ్చిందట. దీంతో ఆసీస్ జట్టు నుంచి అతడిని పక్కన పెట్టారని అంటున్నారు.
ఏం జరిగిందంటే..?
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్న సిక్స్ అండ్ అవుట్ బ్యాండ్ అడిలైడ్‌లో ఓ కన్సర్ట్ను నిర్వహించింది. జనవరి 19న జరిగిన ఈ కార్యక్రమంలో మాక్స్వెల్ సైతం పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు అతిగా మద్యం సేవించాడు. దీంతో అస్వస్థతకు గురికావడంతో అతడిని పబ్ నుంచి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారట. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు ఆసీస్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా.. ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చాలా తీసుకుందని తెలుస్తోంది. అందుకనే అతడిని వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు పక్కన పెట్టింది. అసలు అక్కడ ఏమైందనే విషయాలను తెలుసుకునేందుకు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు.
Ashwin : అరుదైన రికార్డుకు చేరువలో రవిచంద్రన్ అశ్విన్.. ఉప్పల్లోనే అందుకుంటాడా..?
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతడిని వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు పక్కన బెట్టారని అంటుండగా.. సీఏ మాత్రం టీ20 సిరీస్‌లో అతడు ఆడతాడని, పని ఒత్తిడి కారణంతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదని చెప్పుకొచ్చింది.
ఇటీవల జరిగిన బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు మాక్స్వెల్ సారథ్యం వహించాడు. తన జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చలేకపోయాడు. గత రెండు మూడు సీజన్లుగా జట్టు సెమీ ఫైనల్‌కు చేరడంలో విఫలం కావడంతో తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు.
ఇదిలా ఉంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు నేడు జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్‌కు విశ్రాంతి ఇచ్చారు. స్టీవ్‌స్మిత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. మాక్స్‌వెల్‌తో పాటు జే రిచర్డ్సన్ల వేటు వేశారు. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, గ్జావియర్ బార్ట్లెట్లను అవకాశం కల్పించారు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఆసీస్ జట్టు ఇదే..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్, అబాట్, గ్జావియర్ బార్ట్లెట్, ఆరోన్ హర్డీ, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, లాన్సే మోరిస్, మ్యాట్ షార్ట్, ఆడం జంపా.
