Glenn Phillips : చ‌రిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్‌.. ఏకైక న్యూజిలాండ్ ప్లేయ‌ర్‌..

Glenn Phillips : న్యూజిలాండ్ స్టార్ ఆట‌గాడు గ్లెన్ ఫిలిప్స్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Glenn Phillips creates history became most runs for New Zealand in a bilateral T20I series

Glenn Phillips : న్యూజిలాండ్ స్టార్ ఆట‌గాడు గ్లెన్ ఫిలిప్స్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఓ ద్వైపాక్షిక్ష టీ20 సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. హామిల్ట‌న్ వేదిక‌గా భార‌త్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 56 ప‌రుగుల వ‌ద్ద అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా అత‌డు 38 బంతులు ఎదుర్కొన్నాడు. 8 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 65 పరుగుల‌తో అజేయంగా నిలిచాడు.

ఓ ద్వైపాక్షిక్ష టీ20 సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు గ‌తంలో ఇంగ్లాండ్ ఆట‌గాడు ఫిల్ సాల్ట్ పేరిట ఉండేది. 2023 డిసెంబ‌ర్‌లో వెస్టిండీస్‌తో జ‌రిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అత‌డు 331 ప‌రుగులు చేశాడు.

తాజాగా భార‌త్‌తో జ‌రిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో గ్లెన్ ఫిలిప్స్ 341 ప‌రుగుల‌తో సాల్ట్ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇక ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్ మూడో స్థానంలో ఉన్నాడు. అత‌డు 2022లో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఆరు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 316 ప‌రుగులు చేశాడు.

న్యూజిలాండ్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు..

ఓ ద్వైపాక్షిక్ష టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా గ్లెన్ ఫిలిప్స్ రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో అత‌డు మార్క్‌చాప్‌మ‌న్ రికార్డు బ్రేక్ చేశాడు. 2024లో పాకిస్థాన్ పై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మార్క్ చాప్‌మ‌న్ 290 ప‌రుగులు చేశాడు. తాజాగా భారత్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో గ్లెన్ ఫిలిఫ్స్ 341 ప‌రుగులు సాధించాడు.