IND vs NZ : ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ అర్థశతకాలు.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?
IND vs NZ : హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ ముగిసింది.
IND vs NZ 5th T20 match Ishan Kishan and Shreyas Iyer half centuries New Zealand target is 192
IND vs NZ : హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఇషాన్ కిషన్ (61; 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50; 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థశతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. దీంతో కివీస్ ముందు 192 పరుగుల లక్ష్యం నిలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఏదీ కలిసి రాలేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (1), సంజూ శాంసన్ (4)లు త్వరగానే పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. తొలుత వీరిద్దరు క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్నారు. ఆ తరువాత బ్యాట్ ఝుళిపించారు. మైఖేల్ బ్రాస్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో 27 పరుగులు రాబట్టారు.
Ishan Kishan : టీ20 క్రికెట్లో ఇషాన్ కిషన్ మరో మైలురాయి.. హార్దిక్ పాండ్యా రికార్డు బ్రేక్..
Innings Break!
A collective batting effort helps #TeamIndia set a target of 1️⃣9️⃣2️⃣ 🙌
Over to our bowlers to defend this ⏳
Scorecard ▶️ https://t.co/B5TqF9MWu4
#NZvIND https://t.co/Jm4HhjFOHO
— BCCI (@BCCI) November 1, 2026
అయితే.. భారీ షాట్లు ఆడే క్రమంలో అర్థశతకాలు పూర్తి చేసుకున్న తరువాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో భారత ఇన్నింగ్స్ వేగం మందగించింది. తిలక్ వర్మ (6) విఫలం కాగా.. నమన్ ధీర్ (33; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ ), నితీశ్ కుమార్ రెడ్డి (22; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో భారత్ 200 పరుగులకు దిగువనే ఆగిపోయింది.
న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే నాలుగు వికెట్లు తీశాడు. నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
