RCB vs GT: బెంగళూరుకు షాకిచ్చిన శుభ్‌మన్ గిల్.. ఆర్‌సీబీ ఇంటికి.. ప్లే ఆఫ్స్‌కు ముంబై
ఐపీఎల్ 2023లో భాగంగా చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
- Thota Vamshi Kumar
- Published On : May 22, 2023 / 12:15 AM IST
GT win (photo @ipl)
IPL 2023: ఐపీఎల్ 2023లో భాగంగా చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ప్లే ఆఫ్స్‌కు చేరాలన్న బెంగళూరు ఆశలు గల్లంతు అయ్యాయి. నాలుగో జట్టుగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (104నాటౌట్; 52 బంతుల్లో5 ఫోర్లు 8 సిక్సర్లు) శతకంతో విధ్వంసం సృష్టించగా, విజయ్ శంకర్(53 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. వృద్ధిమాన్ సాహా(12), ధసున్ శనక(0) , డేవిడ్ మిల్లర్ (6) విఫలం అయ్యారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు తీయగా విజయ్‌కుమార్ వైశాక్, హర్షల్ పటేల్‌లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(101 నాటౌట్; 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. 60 బంతుల్లో విరాట్ శతకం బాదాడు. ఐపీఎల్‌లో విరాట్‌కు ఇది ఏడో శతకం కాగా.. ఈ సీజన్‌లో వరుసగా రెండోది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ విరాట్ రికార్డు నెలకొల్పాడు. మిగిలిన వారిలో డుప్లెసిస్(28), మైఖేల్ బ్రేస్‌వెల్(26) పర్వాలేదనిపించగా ఆఖర్లో అనుజ్ రావత్(23 నాటౌట్; 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ, యశ్ దయాల్, రషీద్ ఖాన్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
MI vs SRH: శతక్కొటిన గ్రీన్.. హైదరాబాద్ పై ఘన విజయం.. ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
