IND vs NZ : న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భార‌త జ‌ట్టులో కీల‌క మార్పు.. కుల్దీప్ యాద‌వ్ పై వేటు.. గుర్నూర్‌కు చోటు..

IND vs NZ : భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య న‌వంబ‌ర్ 19 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

Gurnoor Brar added to Team India squad for IND vs NZ Tests

IND vs NZ : భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య న‌వంబ‌ర్ 19 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్ప‌టికే బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. అయితే.. తాజాగా ఆ జ‌ట్టులో ఓ మార్పును చేసింది. యువ పేస‌ర్ గుర్నూర్ బ్రార్‌ను జ‌ట్టులోకి ఎంపిక చేసింది. అదే స‌మ‌యంలో కుల్దీప్ యాద‌వ్‌ను జ‌ట్టులోంచి తొల‌గించింది.

పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితులు ఉండటంతో రెండు టెస్టుల కోసం కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండే అవకాశం లేదని భావించారు. ఈ నేపథ్యంలో కుల్దీప్‌ను టెస్ట్ జట్టు నుంచి విడుదల చేసి, భారత్‌లో జరుగుతున్న దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు అనుమతించినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వెల్లింగ్టన్‌లోని భారత టెస్ట్ జట్టుతో చేరాడు.


సుధీర్ఘ ఫార్మాట్‌కు ఎంపిక అయిన నేప‌థ్యంలో గుర్నూర్ బ్రార్ టెస్టు జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఐదో వ‌న్డేకి అందుబాటులో ఉండ‌డు. అత‌డి స్థానంలో ఎవ‌రిని ఎంపిక చేయ‌లేదు అని బీసీసీఐ తెలిపింది.

ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్లు ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడుతున్నాయి. ప్ర‌స్తుతానికి సిరీస్‌లో భార‌త్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
ఈ సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే ఆదివారం (న‌వంబ‌ర్ 15న‌) జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ న‌వంబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానుంది. శుభ్‌మన్ గిల్ నాయ‌క‌త్వంలో భారత జ‌ట్టు టెస్టులో ఆడ‌నుంది.

న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు అప్‌డేట్ చేసిన భారత జట్టు ఇదే..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.

ఐదో వన్డేకు భారత జట్టు ఇదే..

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఔకిబ్ నబీ, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.