Gurnoor Brar : టీమ్ఇండియా పేసర్ గుర్నూర్ బ్రార్‌కు ఐసీసీ షాక్..
టీమ్ఇండియా పేసర్ గుర్నూర్ బ్రార్‌పై (Gurnoor Brar ) ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 16, 2026 / 08:06 PM IST
Gurnoor Brar has been warned by icc for a level one breach during the first ODI against England
Gurnoor Brar : టీమ్ఇండియా పేసర్ గుర్నూర్ బ్రార్‌పై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు గాను అతడిని హెచ్చరించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
‘అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో ఒక ఆటగాడిపైకి లేదా అతని సమీపంలోకి అనుచితంగా లేదా ప్రమాదకర రీతిలో బంతిని విసరడానికి సంబంధించిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ను బ్రార్ ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో బ్రార్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చాం. 24 నెలల కాలంలో అతడు చేసిన తొలి తప్పు ఇదే. ఇక చేసిన తప్పును, విధించిన శిక్షను అతడు అంగీకరించాడు. దీంతో దీనిపై ఇకపై ఎలాంటి విచారణ ఉండదు.’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఏం జరిగిందంటే?
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లోని ఎనిమిదో ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. బ్రార్ బౌలింగ్‌లో బెన్ డకెట్ ఫోర్ కొట్టాడు దీంతో బ్రార్ కాస్త అసహనానికి గురి అయ్యాడు. ఆ తరువాత బంతిని డకెట్ కొట్టగా.. బాల్ బ్రార్ వద్దకే వచ్చింది. వెంటనే బంతిని అందుకున్న అతడు డకెట్‌కు కాస్త పక్కగా విసిరాడు. అతడు బ్యాటర్‌కు ప్రమాదకరంగా బంతిని విసరడంతో ఐసీసీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
భారత్ విజయం సాధించిన ఈ మ్యాచ్‌లో బ్రార్ 9 ఓవర్లు వేసి 61 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
