IND vs PAK : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సార్లు తలపడనున్న భారత్, పాక్.. వన్డే ప్రపంచకప్ 2027లో.. ఐసీసీ స్కెచ్ అదుర్స్!
అంతర్జాతీయ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు (IND vs PAK) ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
IND vs PAK clashes in ODI World Cup 2027 Not 1 Not 2 three times
IND vs PAK : అంతర్జాతీయ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా భారత్, పాక్ ల మధ్య ద్వైపాక్షిక్ష సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ మెగా ఈవెంట్లలోనే ఈ రెండు జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. వచ్చ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో వన్డే ప్రపంచకప్ 2027 జరగనుంది. ఈ మెగాటోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా.. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ లు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు తలపడే అవకాశాలు ఉన్నాయి. ఇందు కోసం ఐసీసీ కొత్త ఫార్మాట్ ను ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.
వన్డే ప్రపంచకప్2027లో 14 జట్లు కప్పు కోసం పోటిపడనున్నాయి. ఫార్మాట్ చాలా కొత్తగా ఉండనుంది.
మొదటి దశ..
ర్యాంకింగ్స్లో 12, 13, 14 స్థానాల్లో ఉన్న మూడు జట్ల మధ్య పోటీ జరగనుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టు మిగిలిన 11 జట్లతో కలిసి అసలైన టోర్నీలో ఆడనుంది.
రెండో దశ (గ్రూప్ స్టేజ్)..
మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కొ గ్రూప్లో 6 జట్లు ఉండనున్నాయి. ఒక్కొ గ్రూప్లో టాప్-3లో నిలిచిన జట్లు తదుపరి దశకు చేరుకుంటాయి. అయితే.. ఈ సారి కాస్త కొత్తగా రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్ల మధ్య ఓ పోటీ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు కూడా మిగిలిన ఆరు జట్లతో కలిసి తదుపరి దశకు వెళ్లనుంది.
సూపర్-7..
మొత్తం ఏడు జట్లు ఒకదానితో ఒకటి రౌండ్-రాబిన్ పద్ధతిలో తలపడతాయి. టాప్-4లో నిలిచిన జట్ల సెమీస్కు చేరుకుంటాయి. సెమీఫైనల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్లో కప్పు కోసం పోటీపడతాయి.
MS Dhoni : తొలి వన్డేలో ధోని సందడి.. మిస్టర్ కూల్ చెవిలో ఉన్న ఆ వింత పరికరం ఏంటో తెలుసా?
భారత్–పాకిస్థాన్ జట్లు మూడు సార్లు ఎలా తలపడతాయంటే?
సాధారణంగా మెగా టోర్నీలో భారత్, పాక్ జట్లను ఐసీసీ ఒకే గ్రూపులో ఉంచుతుంది అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్ దశలో ఓ సారి ఇరు జట్లు తలపడతాయి. ఆ తరువాత రెండు జట్లు సూపర్-7కి చేరుకుంటే అక్కడ మరోసారి తలపడతాయి. ఆ తరువాత రెండు జట్లు సెమీస్కు అర్హత సాధిస్తే.. సెమీస్లోనో లేదంటే ఫైనల్లోనో తలపడనున్నాయి.
