Indiramma Indlu Scheme : ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల గడువు ముగింపు.. నెక్ట్స్ ఏంటి? అప్లయ్ చేసినవాళ్లు ఏం చేయాలి?
Indiramma Indlu Scheme : ఇందిరమ్మ ఇండ్ల కోసం గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోలేక పోయిన వారు ఒకవేళ ప్రభుత్వం దరఖాస్తుల గడువు పెంచితే దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే..
Indiramma Indlu Scheme
Indiramma Indlu Scheme : హైదరాబాద్ నగరంలో ఇండ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను నిర్మించి ఇస్తోంది. 16 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న మొత్తం 7,340 ఇళ్ల కోసం ఆగస్టు 10వ తేదీ వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీటికోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే, ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్నవాళ్లు ఏం చేయాలి? దరఖాస్తు చేయని వారి పరిస్థితి ఏంటి? వాళ్లకు ఎలా అవకాశం ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మత్స్యకారులకు శుభవార్త.. వారందరికీ రూ.5లక్షలు..
ఆగస్టు 10వ తేదీతో హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఇకనుంచి అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఇళ్ల సంఖ్య, ఇతర నిబంధనల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే, దరఖాస్తు చేసుకున్న వారు తమ అప్లికేషన్ నెంబర్, రసీదు, చెల్లింపు వివరాలను భద్రంగా ఉంచుకోవాలి. తరువాత అధికారిక పోర్టల్లో తమ దరఖాస్తు స్థితిని పరిశీలించుకోవచ్చు. దరఖాస్తులో ఏవైనా వివరాలు తప్పుగా నమోదైయ్యాయా.. చెల్లింపు పూర్తయిందా వంటి అంశాలను కూడా చెక్ చేసుకోవడం మంచింది.
దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయిన తరువాత నిబంధనల ప్రకారం.. అర్హత లేని వారిని తొలగిస్తారు. ఆ తరువాత ఆగస్టు 20వ తేదీన లాటరీ నిర్వహించనున్నారు. లాటరీలో ఇల్లు కేటాయించని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ. 10వేల డిపాజిట్ ను తిరిగి చెల్లిస్తారు. లాటరీ ద్వారా అర్హత పొందిన వారికి రూ. 6లక్షలకే ప్లాట్ ను కేటాయించనున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోలేక పోయిన వారు ఒకవేళ ప్రభుత్వం దరఖాస్తుల గడువు పెంచితే దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే మళ్లీ ప్రభుత్వం నుంచి అధికారికంగా కొత్త ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన ఇల్లు ఖరారైనట్లు కాదు. ముందుగా అర్హతల పరిశీలన ఉంటుంది. ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారి దరఖాస్తులనే అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. ఆ తరువాత లాటరీ పద్దతి ఇండ్లకు ఎంపిక చేస్తారు.
తొలి దశలో హైదరాబాద్లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ LIG ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 525 చదరపు అడుగులు. ఒక్కో ఫ్లాట్ మొత్తం వ్యయం రూ.11 లక్షలుగా ఉండగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ భరిస్తుంది. లబ్ధిదారుడు మిగిలిన రూ.6 లక్షలను చెల్లించాల్సి ఉంటుంది.
