రైనా తర్వాత ఐపీఎల్ నుంచి హర్భజన్ అవుట్

వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నుంచి పర్సనల్ రీజన్స్ రీత్యా తప్పుకున్నారు. హర్భజన్ సింగ్ అతని నిర్ణయాన్ని చెన్నై సూపర్ కింగ్స్‌కు శుక్రవారమే తెలియజేశాడు. పర్సనల్ రీజన్స్ తో తప్పుకున్న రెండో ప్లేయర్ హర్భజన్ మాత్రమే. యూఏఈ నుంచి రైనా ఇంటికి చేరుకున్నాడు.



ఇదిలా ఉంటే, హర్భజన్ సింగ్ ప్రత్యేక కారణాల రీత్యా స్వదేశంలోనే ఉండిపోయాడు. క్యాష్ రిచ్ లీగ్ 13వ సీజన్ లో జట్టుకు దూరం కానున్నాడు. ‘అతని నుంచి ఎటువంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ రాలేదు. శుక్రవారం లేదా శనివారం నాటికి ఏదొక ఇన్ఫర్మేషన్ వస్తుందని ఆశిస్తున్నాం. కానీ, టీం మేనేజ్మెంట్ అతను లేకుండా సర్వీసులు కొనసాగించేందుకు ప్లాన్ చేస్తున్నాయి’ అని సమాచారం.
https://10tv.in/telangana-bjp-mla-raja-singh-on-terrorists-hit-list-security-enhancement/
13మందికి వైరస్ రిజల్ట్ పాజిటివ్ రాగా.. అందులో ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు. ఐపీఎల్ మెడికల్ టీం వాళ్లను పర్యవేక్షిస్తుంది. సెప్టెంబర్ 1న సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ మరే తాజా కరోనావైరస్ కేసులు లేవని నిర్థారించారు. పాజిటివ్ వచ్చిన వారందరికి 14రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు.