Hardik Pandya-Mahieka Sharma : మహికా శర్మతో బీచ్‌లో జలకాలాడుతున్న హార్దిక్ పాండ్యా .. 11:11 ఏంటో మరీ?
మోడల్ మహికా శర్మతో హార్దిక్ పాండ్య (Hardik Pandya-Mahieka Sharma) డేటింగ్‌లో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.
Hardik Pandya And Mahieka Sharma Ocean Moment
Hardik Pandya-Mahieka Sharma : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. తనకు దొరికిన విరామాన్ని అతడు చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా అతడే సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
సెర్బియా నటి నటాసా స్టాంకోవిక్ నుంచి విడిపోయిన తర్వాత మోడల్ మహికా శర్మతో హార్దిక్ పాండ్య డేటింగ్‌లో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు (Hardik Pandya-Mahieka Sharma)కూడా పలు సందర్భాల్లో జంటగా కనిపించడం కూడా ఆ వార్తలకు బలం చేకూర్చింది. అయితే.. అటు హార్దిక్ గానీ, ఇటు మహికా గానీ ఈ విషయంపై ఎప్పుడూ స్పందించలేదు.

అయితే.. తాజాగా హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో కొన్ని ఫోటోలను పంచుకున్నాడు. అందులో ఓ ఫోటోలో మహికా శర్మతో కలిసి హార్దిక్ బీచ్‌లో జలకాలాడుతూ చిల్ అవుతున్నట్లుగా ఉంది. దీంతో వీరిద్దరు డేటింగ్ ఉన్నారనేది నిజం అని నెటిజన్లు అంటున్నారు.
అయితే.. ఆ ఫోటో పై 11:11 అని ఉంది. దీని అర్థం ఏంటోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నెల 11న ఏదైన శుభవార్త చెబుతారేమోనని అంటున్నారు.
View this post on Instagram
