IND vs AUS 4th T20 : ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 మ్యాచ్.. కెరీర్ మైల్ స్టోన్స్ పై సంజూ శాంసన్, తిలక్ వర్మ కన్ను..
గురువారం క్వీన్స్‌ల్యాండ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ (IND vs AUS 4th T20) జరగనుంది.
IND vs AUS 4th T20 Sanju samson and Tilak Varma eye on 1000runs milestone in International t20s
IND vs AUS 4th T20 : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. దీంతో ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమమైంది.
గురువారం (నవంబర్ 6న) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య క్వీన్స్‌ల్యాండ్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరా హోరీగా సాగే అవకాశం ఉంది. ఇక నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మను ఓ వ్యక్తిగత మైలురాయి ఊరిస్తోంది.
2023లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అరంగ్రేటం చేశాడు తిలక్ శర్మ. ఇప్పటి వరకు భారత్ తరుపున 35 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 32 ఇన్నింగ్స్‌ల్లో 49.5 సగటుతో 147.2 స్ట్రైక్‌రేటుతో 991 పరుగులు సాధించాడు. నాలుగో టీ20 మ్యాచ్‌లో అతడు 9 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరతాడు.
5 రన్స్ చేస్తే..
2015లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు సంజూ శాంసన్. ఇప్పటి వరకు 51 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 43 ఇన్నింగ్స్‌ల్లో 25.5 సగటు 147.4 స్ట్రైక్‌రేటుతో 995 పరుగులు సాధించాడు. ఆసీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో అతడు 5 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 పరుగులు సాధించిన బ్యాటర్ల క్లబ్‌లో చేరతాడు.
