Abhishek Sharma : ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 మ్యాచ్.. విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు పై అభిషేక్ శర్మ కన్ను..
ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మను (Abhishek Sharma) ఓ భారీ రికార్డు ఊరిస్తోంది.
IND vs AUS 4th T20 Abhishek Sharma on cusp of equalling Virat Kohli all time record in T20s
Abhishek Sharma : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం క్వీన్స్‌ల్యాండ్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గనుక అభిషేక్ 39 పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
ప్రస్తుతం ఈ రికార్డు పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 27 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఆ తరువాతి స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. 29 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఇక అభిషేక్ శర్మ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 27 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 26 ఇన్నింగ్స్‌ల్లో 37 సగటు, 192.2 స్రైక్‌రేటుతో 961 పరుగులు చేశాడు.
టీమ్ఇండియా తరుపున టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 27 ఇన్నింగ్స్‌ల్లో
* కేఎల్ రాహుల్ – 29 ఇన్నింగ్స్‌ల్లో
* సూర్యకుమార్ యాదవ్ – 31ఇన్నింగ్స్‌ల్లో
ప్రస్తుతం అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో నాలుగో టీ20 మ్యాచ్‌లోనే అతడు ఈ రికార్డును అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే.. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఏడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ కు చెందిన డేవిడ్ మలన్ అగ్రస్ఠానంలో ఉన్నాడు. అతడు 24 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* డేవిడ్ మలన్ (ఇంగ్లాండ్) – 24 ఇన్నింగ్స్‌ల్లో
* సబావూన్ డేవిజి (చెక్ రిపబ్లిక్) – 24 ఇన్నింగ్స్‌ల్లో
* కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (జపాన్) – 25 ఇన్నింగ్స్‌ల్లో
* బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) – 26 ఇన్నింగ్స్‌ల్లో
* డెవాన్ కాన్వే (న్యూజిలాండ్) – 26 ఇన్నింగ్స్‌ల్లో
* ముహమ్మద్ వసీం (యుఏఈ) 26 ఇన్నింగ్స్‌ల్లో
* విరాట్ కోహ్లీ (భారత్) – 27 ఇన్నింగ్స్‌ల్లో
* కరణ్‌బీర్ సింగ్ (ఆస్ట్రియా) – 27 ఇన్నింగ్స్‌ల్లో
* ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) – 29 ఇన్నింగ్స్‌ల్లో
* కేఎల్ రాహుల్ (భారత్) – 29 ఇన్నింగ్స్‌ల్లో
* తరంజీత్ సింగ్ (రొమేనియా) – 29 ఇన్నింగ్స్‌ల్లో
