Abrar Ahmed : హ్యాట్రిక్ తీశాన‌న్న ఆనందంలో పాక్ స్పిన్న‌ర్‌ అబ్రాద్ అహ్మ‌ద్‌.. నీ కంత సీన్ లేదంటూ షాకిచ్చిన థ‌ర్డ్ అంపైర్‌..

పాకిస్తాన్ స్పిన్న‌ర్ అబ్రార్ అహ్మ‌ద్ (Abrar Ahmed) హ్యాట్రిక్ తీశాన‌న్న సంతోషంలో ఉండ‌గా.. కొన్ని క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే అత‌డికి థ‌ర్డ్ అంపైర్‌ షాకిచ్చాడు.

Abrar Ahmed : హ్యాట్రిక్ తీశాన‌న్న ఆనందంలో పాక్ స్పిన్న‌ర్‌ అబ్రాద్ అహ్మ‌ద్‌.. నీ కంత సీన్ లేదంటూ షాకిచ్చిన థ‌ర్డ్ అంపైర్‌..

PAK vs SA 1st ODI Abrar Ahmed missed his hat trick taking two wickets in two balls

Updated On : November 5, 2025 / 11:33 AM IST

Abrar Ahmed : మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ద‌క్షిణాఫ్రికా, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఫైస‌లాబాద్ వేదిక‌గా మంగ‌ళ‌వారం (న‌వంబ‌ర్ 4) తొలి వ‌న్డే మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. పాకిస్తాన్ స్పిన్న‌ర్ అబ్రార్ అహ్మ‌ద్ (Abrar Ahmed) హ్యాట్రిక్ తీశాన‌న్న సంతోషంలో ఉండ‌గా.. కొన్ని క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే అత‌డికి థ‌ర్డ్ అంపైర్‌ షాకిచ్చాడు.

అస‌లేం జ‌రిగిందంటే..?

ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 44వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌ను పాక్ స్పిన్న‌ర్ అబ్రార్‌ అహ్మద్ వేశాడు. మొద‌టి రెండు బంతుల‌కు స‌ఫారీ బ్యాట‌ర్లు బ్రీట్జ్కే, ఫోర్టుయిన్ ల‌ను ఔట్ చేశాడు. ఇక మూడో బంతి వేయ‌గా లుంగి ఎంగిడి డిఫెన్స్ ఆడాడు. అయితే.. బంతి అత‌డి ప్యాడ్ల‌ను తాకింది. వెంట‌నే ఎల్బీ అంటూ పాక్ ఫీల‌ర్లు అప్పీల్ చేయ‌గా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు.

Smriti Mandhana : స్మృతి మంధాన‌కు భారీ షాక్.. ప్ర‌పంచ‌క‌ప్‌లో 434 ర‌న్స్ చేసినా..

దీంతో అబ్రార్ తాను హ్యాట్రిక్ సాధించాన‌న్న ఆనందంలో మునిగిపోయాడు. స‌హ‌చ‌ర క్రికెట‌ర్ల‌తో క‌లిసి సంబ‌రాలు చేసుకుంటుండ‌గా.. ఎంగిడి రివ్యూకి వెళ్లాడు. రిప్లైలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న‌ట్లుగా తేలింది. దీంతో థ‌ర్డ్ అంపైర్ ఎంగిడిని నాటౌట్‌గా ప్ర‌క‌టించాడు. దీంతో కొద్దిలో హ్యాట్రిక్ మిస్ కావ‌డంతో అబ్రార్ తీవ్ర నిరాశ చెందాడు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా 49.1 ఓవ‌ర్‌లో 263 ప‌రుగుల‌కు ఆలౌటైంది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో క్వింట‌న్ డికాక్ (63; 71 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ల్హువాన్-డ్రే ప్రిటోరియస్ (57; 60 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీలు చేశారు. పాక్ బౌల‌ర్ల‌లో నసీమ్ షా, అబ్రార్ అహ్మ‌ద్ లు చెరో మూడు వికెట్లు తీశారు. సైమ్ అయూబ్ రెండు వికెట్లు తీశాడు. షాహిన్ అఫ్రిది, న‌వాజ్‌లు చెరో వికెట్ సాధించాడు.

Harmanpreet Kaur : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచి ఒక్క రోజు కూడా కాలేదు.. అప్పుడే హ‌ర్మ‌న్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోమంటున్నారుగా.

అనంత‌రం 264 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాకిస్తాన్ 49.4 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాట‌ర్ల‌లో స‌ల్మాన్ అఘా (62; 71 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (55; 74 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ‌శ‌త‌కాలు సాధించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో లుంగి ఎంగిడి, డోనోవన్ ఫెర్రీరామ్, కార్బిన్ బాష్ లు త‌లా రెండు వికెట్లు తీశారు. జార్జ్ లిండే, బ్జోర్న్ ఫోర్టుయిన్ లు చెరో వికెట్ సాధించారు.