Smriti Mandhana : స్మృతి మంధాన‌కు భారీ షాక్.. ప్ర‌పంచ‌క‌ప్‌లో 434 ర‌న్స్ చేసినా..

టీమ్ఇండియా స్టార్ ప్లేయ‌ర్ స్మృతి మంధాన‌కు (Smriti Mandhana) భారీ షాక్ త‌గిలింది.

Smriti Mandhana : స్మృతి మంధాన‌కు భారీ షాక్.. ప్ర‌పంచ‌క‌ప్‌లో 434 ర‌న్స్ చేసినా..

ICC womens ODI rankings Smriti Mandhana Loses No1 Spot

Updated On : November 5, 2025 / 10:47 AM IST

Smriti Mandhana : టీమ్ఇండియా స్టార్ ప్లేయ‌ర్ స్మృతి మంధాన‌కు భారీ షాక్ త‌గిలింది. ఇటీవ‌ల ముగిసిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో మంధాన అద్భుతంగా రాణించింది. ఈ మెగాటోర్నీలో భార‌త్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్‌గా నిలిచింది. 9 మ్యాచ్‌ల్లో 54.25 సగటుతో మంధాన (Smriti Mandhana) 434 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికి కూడా ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో ఆమె త‌న అగ్ర‌స్థానాన్ని కాపాడుకోలేక‌పోయింది. ఓ స్థానం దిగ‌జారి రెండో ర్యాంక్‌కు ప‌డిపోయింది.

కాగా.. ఇదే మెగాటోర్నీలో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్ అగ్ర‌స్థానానికి చేరుకుంది. ఆమె త‌న కెరీర్ అత్యుత్త‌మ రేటింగ్ పాయింట్లు సాధించింది. లారా ఖాతాలో 814 రేటింగ్ పాయింట్లు ఉండ‌గా, మంధాన ఖాతాలో 811 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక ఆసీస్ స్టార్ ప్లేయ‌ర్ ఆష్లే గార్డ్‌న‌ర్ ఓ స్థానం దిగ‌జారి మూడుకి చేరుకుంది.

Harmanpreet Kaur : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచి ఒక్క రోజు కూడా కాలేదు.. అప్పుడే హ‌ర్మ‌న్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోమంటున్నారుగా.

ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌లో భారీ శ‌త‌కంతో చెల‌రేగిన జెమీమా రోడ్రిగ్స్ ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగ‌బాకి ప‌దో స్థానంలో నిలిచింది. ఇక హ‌ర్మ‌న్ ప్రీత్ నాలుగు, దీప్తి శ‌ర్మ మూడు, రిచా ఘోష్‌ నాలుగు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని వ‌రుస‌గా 14, 21, 30 స్థానాల్లో నిలిచింది.

ఇక భార‌త్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఆసీస్ ప్లేయ‌ర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ శ‌త‌కంతో చేల‌రేగ‌గా.. ఆమె 13 స్థానాలు ఎగ‌బాకి 13వ ర్యాంక్‌కు చేరుకుంది.

SRH : ఐపీఎల్ 2026 ముందు స‌న్‌రైజ‌ర్స్ కీల‌క నిర్ణ‌యం..! వేలంలోకి హెన్రిచ్ క్లాసెన్‌?

ఇక బౌలర్ల విష‌యానికి వ‌స్తే.. ఇంగ్లాండ్ ప్లేయ‌ర్‌ సోఫీ ఎక్లెస్టోన్ త‌న అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకుంది. ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్‌ మారిజాన్‌ కాప్ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకోగా.. ఆసీస్‌ బౌలర్లు అలానా కింగ్‌, ఆష్లే గార్డ్‌నర్ చెరో స్థానం దిగ‌జారి వ‌రుస‌గా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. టీమ్ఇండియా స్పిన్న‌ర్ దీప్తి శ‌ర్మ త‌న ఐదో స్థానాన్ని కాపాడుకుంది. ఆమె మిన‌హా మ‌రే భార‌త బౌల‌ర్ టాప్‌-15లో లేరు.