Harmanpreet Kaur : ప్ర‌తి రోజు ప్ర‌పంచ‌క‌ప్‌ను చూడొచ్చ‌ని హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఏం చేసిందో చూశారా? పిక్ వైర‌ల్‌

ద‌క్షిణాఫ్రికాను ఓడించి హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాయ‌క‌త్వంలోని టీమ్ఇండియా విశ్వ విజేత‌గా నిలిచింది.

Harmanpreet Kaur : ప్ర‌తి రోజు ప్ర‌పంచ‌క‌ప్‌ను చూడొచ్చ‌ని హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఏం చేసిందో చూశారా?  పిక్ వైర‌ల్‌

I will see you every morning Harmanpreet Kaur gets World Cup tattoo

Updated On : November 5, 2025 / 12:59 PM IST

Harmanpreet Kaur : ఎట్ట‌కేల‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. ఆదివారం (న‌వంబ‌ర్ 2) న‌వీ ముంబై వేదిక‌గా జ‌రిగిన మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాను ఓడించి హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాయ‌క‌త్వంలోని టీమ్ఇండియా విశ్వ విజేత‌గా నిలిచింది. దీంతో స‌ర్వ‌త్రా భార‌త్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

ఇక ఈ విజ‌యాన్ని ఎప్ప‌టికి గుర్తుంచుకునేలా హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఓ నిర్ణ‌యం తీసుకుంది. ఆమె ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీని టాటూగా త‌న చేయిపై వేయించుకుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీతో పాటు గెలిచిన సంవ‌త్స‌రం (2025), ఎన్ని ప‌రుగుల తేడాతో (52 ప‌రుగుల తేడాతో ) గెలిచింది విష‌యాలు తెలియ‌జేసేలా అంకెలు అందులో ఉన్నాయి.

AUS vs ENG : యాషెస్ తొలి టెస్టుకు ఆసీస్ జ‌ట్టు ఇదే.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌కు చోటు..

‘నా చ‌ర్మంలో, నా మ‌న‌సులో ఎప్ప‌టికి చెక్కు చెద‌ర‌దు. తొలి రోజు నుంచి నీ కోసం వేచి చూస్తున్నాను. ఇక ఇప్పుడు ప్ర‌తి రోజు ఉద‌యం నిన్ను చూస్తూ ఉంటాను.’ అంటూ టాటూను పంచుకుంటూ హ‌ర్మ‌న్‌ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Harmann (@imharmanpreet_kaur)

Abrar Ahmed : హ్యాట్రిక్ తీశాన‌న్న ఆనందంలో పాక్ స్పిన్న‌ర్‌ అబ్రాద్ అహ్మ‌ద్‌.. నీ కంత సీన్ లేదంటూ షాకిచ్చిన థ‌ర్డ్ అంపైర్‌..

 

ఈ మెగాటోర్నీలో హర్మన్‌ అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా రాణించింది. ముఖ్యంగా ఫైనల్‌ మ్యాచ్‌లో కీలకమైన సమయంలో ప్రత్యర్థి జట్టును ఆశ్చర్యానికి గురిచేస్తూ ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ‌కు బంతిని ఇచ్చింది. ఈ నిర్ణ‌యం భార‌త్‌కు బాగా క‌లిసి వ‌చ్చింది. ఇక కెప్టెన్ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా షెఫాలీ వ‌ర్మ వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌లో భార‌త్ పుంజుకునేలా చేసింది. హర్మన్ ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌ల్లో 32.50 సగటు 89.4 స్ట్రైక్‌రేట్‌తో 260 పరుగులు చేసింది.