AUS vs ENG : యాషెస్ తొలి టెస్టుకు ఆసీస్ జట్టు ఇదే.. ఎవ్వరూ ఊహించని ప్లేయర్‌కు చోటు..
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య (AUS vs ENG) నవంబర్ 21 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది.
Australia Ashes Squad announcement Marnus Labuschagne Returns
AUS vs ENG : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య నవంబర్ 21 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్ కోసం ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఇక తొలి టెస్టు మ్యాచ్ నవంబర్ 21 నుంచి 25 మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తొలి టెస్టు మ్యాచ్‌లో పాల్గొనే జట్టును ప్రకటించింది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు.
ఈ క్రమంలో సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ జట్టుకు నాయకత్వం వహించనున్నట్లు తెలిపింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో సీనియర్ ఆటగాడు మార్నస్ లబుషేన్ చోటు దక్కించుకున్నాడు. పేలవ ఫామ్‌తో జూలైలో జరిగిన వెస్టిండీస్‌తో సిరీస్‌కు అతడిని ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే.. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో లబుషేన్ శతకాల మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మళ్లీ అతడికి చోటు ఇచ్చారు. కాగా.. ఈ ఆటగాడు 2023 యాషెస్ తరువాత మరో టెస్టు సెంచరీని చేయలేదు.
ఇదిలా ఉంటే.. ఈ జట్టులో ఎవరూ ఊహించని ఓ ఆటగాడికి చోటు దక్కింది. మాట్ రెన్షా, సామ్ కాన్స్టాస్ కాదని జేక్ వెదరాల్డ్ కి చోటు ఇచ్చారు. అతడు పెర్త్ మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగ్రేటం చేయవచ్చు. గత వేసవిలో 31 ఏళ్ల వెదరాల్డ్ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో 50.33 సగటుతో 906 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Get ready!#Ashes pic.twitter.com/rSaiyn68iX
— Cricket Australia (@CricketAus) November 5, 2025
Smriti Mandhana : స్మృతి మంధానకు భారీ షాక్.. ప్రపంచకప్‌లో 434 రన్స్ చేసినా..
మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్‌లు పేసర్లుగా, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నాథన్ లియాన్ కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల కోటాలో కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్ చోటు దక్కించుకున్నారు. కమిన్స్ గైర్హాజరీలో సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్ బ్యాకప్ బౌలర్లుగా జట్టులోకి వచ్చారు. అలెక్స్ క్యారీ రెగ్యులర్ వికెట్‌కీపర్‌గా, జోస్ ఇంగ్లిస్ రిజర్వ్ వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యారు.
ఇంగ్లాండ్‌తో యాషెస్ తొలి టెస్టుకు ఆసీస్ జట్టు ఇదే..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.
