ben stokes : స్టోక్స్ అవుట్.. హార్దిక్ ఏం చేశాడో తెలుసా..వీడియో వైరల్
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
- madhu
- Published On : March 29, 2021 / 03:50 PM IST
Ben Stokes' dismissal
hardik pandya : క్రికెట్. ఈ క్రీడలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు టర్న్ అవుతుందో, గెలుస్తుందని అనుకున్న జట్టు ఓడిపోవడం, అసలు గెలవదని అనుకున్న జట్టు విజయం సాధించడం..ఇలాంటివి ఎన్నో ట్విస్టులు చూస్తుంటాం. అలాగే..భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. చివరికంటా..ఉత్కంఠ రేపింది ఈ మ్యాచ్. సిరీస్ విజేతను తేల్చిన ఆఖరి మ్యాచ్ లో భారత్, ఇంగ్లండ్ పై 7 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే..ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇంగ్లండ్ బ్యాట్ మెన్స్ బెన్ స్టోక్స్ ప్రమాదకరమైన బ్యాట్స్ మెన్. ఇతని తర్వగా అవుట్ చేయకపోతే..క్రీజులో పాతుకపోతే..ఎంత ప్రమాదకరిగా మారుతాడో భారత జట్టుకు తెలుసు. ఎందుకంటే..రెండో మ్యాచ్ లో అతడి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ కారణంగా..మ్యాచ్ భారత్ చేజారింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో ఐదో ఓవర్ లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తున్నాడు. బెన్ స్టోక్స్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇతను ఇచ్చిన క్యాచ్ ను భువనేశ్వర్ కుమార్ మిస్ చేశాడు. అబ్బా..ఎంత పొరపాటు చేశాను..అన్నట్లుగా..హార్ధిక్ విస్మయం వ్యక్తం చేశాడు.
ఇక 11 ఓవర్ నడుస్తోంది. నటరాజన్ వేసిన బంతిని షాట్ ఆడిన స్టోక్స్..బంతిని గాల్లోకి లేపాడు. అక్కడనే ఉన్న శిఖర్ ధావన్ ఏ మాత్రం పొరపాటు చేయకుండా..బాల్ ను ఒడిసి పట్టుకున్నాడు. నో బాల్ ఏమైనా జరిగిందా ? అని భారత శిబిరంలో ఆందోళనలు నెలకొన్నాయి. కానీ..అంపైర్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోయేసరికి…భారత శిబిరంలో ఆనందం విరిసింది. దీంతో హార్దిక్ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. స్టోక్స్ క్యాచ్ పట్టినందుకు గబ్బర్ కు రెండు చేతులు జోడించి దండం పెడుతూ…మోకాళ్ల మీద కూర్చుని ధన్యవాదాలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
#IndiavsEngland #INDvsENG #HardikPandya #natarajan ஹர்திக் பாண்டியா டூ நடராஜன்?? pic.twitter.com/NSMF4H3wZA
— ஜெர்ரி? (@Jerrykutty07) March 28, 2021
Read More : MS Dhoni, Jos Buttler : కరన్ లో ధోనీ లక్షణాలు…బట్లర్ కీలక వ్యాఖ్యలు
