Hardik Pandya : హార్దిక్ పాండ్య ఎమోషనల్.. ‘ప్రతి రోజు నా శక్తినంతా ధారపోస్తున్నా.. ఇది నా దేవాలయం’
టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త.
- Thota Vamshi Kumar
- Published On : January 28, 2024 / 03:31 PM IST
Hardik Pandya
Hardik Pandya shares a video : టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త. వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కోలుకున్నాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరం అయిన అతడు అతి త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం అతడు ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. కాగా.. పాండ్య బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొదలెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా అతడే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
బరోడాలోని మైదానంలోని నెట్స్‌లో పాండ్య కష్టపడుతున్నాడు. ప్రతి రోజు నా శక్తినంతా ధారపోస్తున్నా అంటూ బౌలింగ్ చేస్తున్న వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు. దీని చూసిన అభిమానులు ఐపీఎల్ సమయాని కల్లా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని, ఐపీఎల్ ఆడడంతో పాటు టీ20 ప్రపంచకప్‌లోనూ సత్తా చాటుతాడని ఆశిస్తున్నారు.
AUS vs WI : చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. ఆ నిర్ణయం వల్ల చేజేతులా ఓడిన ఆస్ట్రేలియా..!
కాగా.. వీడియోలో పాండ్య మాట్లాడుతూ.. తనకు బరోడా క్రికెట్ స్టేడియం అంటే ఎంతో ఇష్టం అని చెప్పాడు. ఈ మైదానాన్ని ఓ దేవాలయంగా భావిస్తున్నట్లు తెలిపాడు. 17 సంవత్సరాల క్రితం తన ప్రయాణం ఇక్కడే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నాడు. మళ్లీ ఇక్కడకు రావడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.
ముంబై కెప్టెన్‌గా..
ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ట్రేడింగ్ ద్వారా అతడిని గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకుంది. ఇందుకోసం ముంబై పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి.
కాగా.. హార్దిక్‌ను సొంతం చేసుకున్న ముంబై రోహిత్ శర్మను తప్పించి అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఐపీఎల్ మొదలయ్యే నాటికి పాండ్య ఫిట్‌నెస్ సాధిస్తాడా..? లేదా? అన్న ప్రశ్నలు వచ్చాయి. తాజా వీడియోతో పాండ్య తాను ఐపీఎల్ ఆడతాననే సంకేతాలు ఇచ్చాడు.
Sania Mirza : విడాకుల తరువాత సానియా మీర్జా మొదటి పోస్ట్.. ఏమన్నదంటే..?
