పాండ్యా-రాహుల్‌ల వివాదంలో కీలక మలుపు

ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్‌మన్‌కే ఇవ్వాలి. ఈ మేర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్‌మన్‌కే ఇవ్వాలి. ఈ మేర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

పాండ్యా-రాహుల్‌ల వివాదంలొ తీర్పు మరోసారి వాయిదాపడింది. బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్‌మన్‌కే ఉంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్‌మన్‌కే ఇవ్వాలి. ఈ మేర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

 

తొలుత సమయాబావంతో అంబుడ్స్‌మన్‌ను నిరాకరించేందుకు తటపటాయించిన సుప్రీం.. ఎట్టకేలకు అంబుడ్స్‌మన్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. క్రికెటర్ల భవితవ్యం తేల్చేందుకు బీసీసీలో అంబుడ్స్‌మన్‌గా మాజీ సోలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహను నియమించింది. జస్టిస్ ఏఎమ్ సప్రే, జస్టిస్ ఎస్‌ఏ బొబ్డేల బెంచ్‌తో పాటు అంబుడ్స్‌మెన్ ఈ కేసుపై విచారణ జరపనున్నారు. అనారోగ్యం కారణంగా గోపాల్ సుబ్రమణ్యం రాజీనామా చేయడంతో పీఎస్ నరసింహను ఆ స్థానంలో నియమించింది. మొత్తంగా ఇద్దరు జడ్జీలు, నరసింహ కలిసి హార్దిక్, రాహుల్‌లను విచారణ చేస్తారు. అంతిమంగా నరసింహ ఇచ్చే నివేదికపైనే భారత క్రికెటర్ల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

ఆరంభం నుంచి సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ కేసులో సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఇది చట్టపరమైన వివాదంగా మారితే మరింత ఆలస్యమవుతుందని భావించారు. కానీ, సీవోఏ మరో సభ్యురాలైన డయానా ఎడుల్జీ ససేమిరా కుదరదంటూ బీసీసీఐ లీగల్ సెల్‌ను సంప్రదించింది. లీగల్ సెల్ కూడా.. కేసును సుప్రీంకు పంపాలని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో లేని హార్దిక్, రాహుల్.. త్వరలో న్యూజిలాండ్ సిరీస్‌లో ఆడతారో లేదోననే సందేహాలు లేకపోలేదు.

ట్రెండింగ్ వార్తలు