IND vs ENG : సెమీస్ మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఇంగ్లాండ్ కెప్టెన్ వార్నింగ్.. మా దగ్గర డేటా ఉంది.. ఎక్కడ బంతులేస్తే..
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో సెమీస్ మ్యాచ్‌కు (IND vs ENG) ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : March 5, 2026 / 09:42 AM IST
Harry brook warning to team india ahead of T20 World Cup 2026 Semis match
- గురువారం వాంఖడే వేదికగా రెండో సెమీస్ మ్యాచ్
- తలపడనున్న భారత్, ఇంగ్లాండ్
- మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కామెంట్స్
IND vs ENG : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్ చేరుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగాటోర్నీలో తాము ఇంత వరకు పరిపూర్ణమైన (అత్యుత్తమ) మ్యాచ్ ఆడలేదన్నాడు. అయినప్పటికి కూడా సమిష్టిగా రాణించి సెమీస్ చేరుకున్నామని అన్నాడు.
ఒక్కొ మ్యాచ్‌ల్లో ఒక్కొక్కరు రాణించినట్లుగా గుర్తు చేసుకున్నాడు. భారత్‌తో మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో ఆడతామన్నాడు. ఇక తమకు స్పిన్ ఆడడంలో గొప్ప రికార్డు లేనప్పటికి కూడా ప్రస్తుత టీమ్ స్పిన్‌ను చాలా చక్కగా ఆడగలదన్నాడు.
T20 World Cup 2026 : ఔట్ అంటావా మామ..? కాదంటావా? మార్‌క్రమ్ ఔట్ పై దుమారం.. వీడియో వైరల్
టీ20ల్లో వరుణ్ చక్రవర్తి ప్రపంచంలోనే నంబన్ వన్ స్పిన్నర్ అని అతడిని ఎదుర్కొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అతడి బౌలింగ్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబడతామన్నాడు.
తమ వద్ద చాలా డేటా ఉందన్నాడు. టీమ్ఇండియా బ్యాటర్లు ఎక్కడ బంతి విసిరితే భారీ షాట్లు కొడతారు? ఎక్కడ బంతి విసిరితే ఇబ్బంది పడతారు అనే విషయం పై తమకు పూర్తి స్పష్టత ఉందన్నాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా భారత జట్టు బలమైన జట్టు అని అంగీకరించాడు. అయినప్పటికి కూడా భారత్‌ను ఇబ్బంది పెట్టి విజయం సాధించి ఫైనల్ చేరుకుంటామనే ధీమాను వ్యక్తం చేశాడు.
బట్లర్ ఫామ్ పై ఆందోళన లేదు..
ఈ మెగాటోర్నీలో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 62 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ విషయం పై హ్యారీ బ్రూక్ మాట్లాడాడు. బట్లర్ ఫామ్ పై తమకు ఆందోళన లేదన్నాడు. అతడు ఒక్కసారి కుదురుకుంటే ఎలా ఆడతాడో అందరికి తెలుసునని అన్నాడు. ఫిల్ సాల్ట్ తో కలిసి అతడు భారత బౌలింగ్ పై ఆధిపత్యం చెలాయిస్తాడనే నమ్మకం ఉందన్నాడు.
టీ20ల్లో ఇప్పటి వరకు భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటి వరకు 29 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా 12 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్ విషయానికి వస్తే ఇప్పటి వరకు భారత్, ఇంగ్లాండ్ జట్లు ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
