భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడేసింది. తొలి రెండింటిలోనూ పరాజయం పొంది దారుణమైన వైఫల్యాన్ని మూటగట్టుకుంది. తమ చేతకానితనాన్ని చెప్పుకోకుండా భారత హోటళ్లు ప్రొటీన్ ఫుడ్ అందించలేకపోతున్నాయి. అంటూ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డీన్ ఎల్గర్ భారత హోటళ్లపై విమర్శలు గుప్పించాడు.
దీంతో నెటిజన్లు అతనిపై దాడికి దిగారు. భారత అభిమానుల నుంచి ఎదుర్కొంటున్న కామెంట్లపై ఎలా స్పందించాడో చూడాలి. అసలు ఎల్గర్ ట్వీట్‌లో ఏం రాశాడంటే.. ‘ఇదొక చాలెంజింగ్ టూర్. ఓ వ్యక్తిగా, క్రికెటర్‌గా ఎదగాలంటే, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇలాంటి చిన్న ప్రదేశాలకు వచ్చినప్పుడు హోటళ్లు సరైన సరఫరా చేయలేకపోవచ్చు. అటువంటి సమయంలో సమర్థంగా ఎదుర్కోవడమే ఛాలెంజ్ లాంటిదే’ అని ట్వీట్ చేశాడు.
దాంతో పాటు ‘భారత్ కు వచ్చినప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. వాళ్లు గల్లీ స్థాయి ఆటతో పాటు పర్యాటక జట్టులతో తెలివిగా ప్రవర్తిస్తారు’ అని కామెంట్ చేశాడు. దీనిపై కేప్ టౌన్‌లో హోటళ్లు భారత ప్లేయర్లకు ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారో గుర్తు చేస్తూ.. అక్కడ నీటి కొరతతో 2నిమిషాల స్నానం సంగతి చెబుతున్నారు.