Gautam Gambhir : వెస్టిండీస్ పై భారత్ వన్డే సిరీస్ విజయం.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పోస్ట్ వైరల్..
వెస్టిండీస్ పై వన్డే సిరీస్ విజయం సాధించిన తరువాత భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir ) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
- Thota Vamshi Kumar
- Published on- October 4, 2026 / 11:34 AM IST
Head coach Gautam Gambhir Unmissable Post After Team India Win ODI Series against West Indies
Gautam Gambhir : వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్ మూడో వన్డేలో మాత్రం వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైంది. శనివారం న్యూచండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అద్భుత ఇన్నింగ్స్‌తో తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ సిరీస్‌లో ఉపయోగించిన పిచ్‌లపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో ఇరు జట్లు కలిపి 800కు పైగా పరుగులు చేయడంతో.. ఆ మ్యాచ్‌ను గంభీర్ ‘నో క్రికెట్’ అంటూ విమర్శించాడు.
అయితే సిరీస్ ముగిసిన అనంతరం గంభీర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆసక్తి కరంగా మారింది.
‘నమ్మకం, కఠోర శ్రమతో గెలిచిన సిరీస్ ఇది. మా ఆటగాళ్ల పట్ల గర్వంగా ఉంది. పోరాడి సాధించుకునేలా చేసిన వెస్టిండీస్‌కు వెస్టిండీస్‌కు కృతజ్ఞతలు.’ అని గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (129 నాటౌట్; 87 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ (92; 85 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (57; 69 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ మూడు వికెట్లు తీశాడు. కీమో పాల్ రెండు వికెట్లు పడగొట్టాడు. మోటీ ఓ వికెట్ సాధించాడు.
Shai Hope : ధోని సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కీలక కామెంట్స్..
అనంతరం 352 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ షై హోప్ (162 నాటౌట్; 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకంతో రాణించాడు. అమీర్ జంగూ(67; 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో సిరాజ్, గుర్నూర్ బార్, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ సాధించారు.
