సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్.. క్లాసెన్ కూతురి వీడియో వైరల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ తన బ్యాటింగ్‌తో అభిమానులనే కాదు సొంత కూతుర్ని కూడా అలరించాడు.
- Naga Srinivasa Rao Poduri
- Published on- March 28, 2024 / 01:28 PM IST
Heinrich Klaasen daughter cute video: సొంత స్టేడియంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపింది. రికార్డు స్కోరుతో ఐపీఎల్ మెగా టోర్నీలో హిస్టరీ క్రియేట్ చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు ట్రావెన్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్.. ఫాస్ట్ హాఫ్ సెంచరీలతో చెలరేగంతో భారీ స్కోరు సాధించింది. ఈ ముగ్గురు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి ముంబై ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా 277 పరుగుల రికార్డు స్కోరుతో సన్‌రైజర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఐపీఎల్ మజాను సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఉప్పల్ స్టేడియంలో సంపూర్తిగా ఆస్వాదించారు. సిక్సర్లు, బౌండరీల సునామీలో ఫ్యాన్స్ తడిసిముద్దయ్యారు. ఉప్పల్ మైదానంలో నిన్నరాత్రి జరిగిన ముంబై, హైదరాబాద్ మ్యాచ్‌ను పిల్లలు, పెద్దలు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ క్లాసెన్ తన బ్యాటింగ్‌తో అభిమానులనే కాదు సొంత కూతుర్ని కూడా అలరించాడు.
Also Read: ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. అవేమిటంటే?
తన తండ్రి ఆటను చూసి క్లాసెన్ కూతురు కేరింతలు కొడుతున్న వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ లో షేర్ చేసింది. స్టేడియంలో పచ్చతివాచీ పరిచిన మెట్టుపై కూర్చొని, బుల్లి చేతులతో సన్‌రైజర్స్ జెండాను అటుఇటు ఊపుతూ చిన్నారి సందడి చేసింది. పక్కనే ఉన్న క్లాసెన్ భార్య తన బుజ్జిపాపను చూసి మురిసిపోయింది. ఈ వీడియో వైరల్ మారింది. పాప చాలా క్యూట్‌గా ఉందని, కూర్చొవడానికి ఇంత కంటే బెస్ట్ ప్లేస్ ఉండదంటూ నెటిజనులు కామెంట్స్ పెట్టారు.
