Vaibhav Sooryavanshi : వైభవ్ సక్సెస్ సీక్రెట్స్ ఇవే.. ఈ రేంజ్ లో విజయాల వెనుక..

ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలో ఎవ‌రి నోటా విన్నా కూడా ఒకే పేరే వినిపిస్తోంది అదే వైభవ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi).

Here are the Vaibhav Sooryavanshi Batting success secrets (pic credit@ipl)

Vaibhav Sooryavanshi : ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలో ఎవ‌రి నోటా విన్నా కూడా ఒకే పేరే వినిపిస్తోంది అదే వైభవ్ సూర్య‌వంశీ. 15 ఏళ్ల ఈ కుర్రాడు అంచ‌నాల‌కు మించి రాణిస్తున్నాడు. దిగ్గ‌జ బౌల‌ర్ల‌ను సైతం అనామ‌క ఆట‌గాళ్లుగా మార్చేస్తూ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2025 ముందు వెలుగులోకి వ‌చ్చిన ఈ బిహారీ కుర్రాడు త‌న మెరుపులు కేవ‌లం ఒక్క సీజ‌న్‌కు మాత్ర‌మే ప‌రిమితం కాద‌ని నిరూపించాడు.

14 ఏళ్ల వయసులోనే (2025 ఐపీఎల్) ధనాధన్ లీగ్ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన వైభ‌వ్, ఆ త‌రువాత భార‌త్-ఏ త‌రుపున అద‌ర‌గొట్టాడు. ఇక అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్ కైవ‌సం చేసుకోవ‌డంలోనూ కీల‌క పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ 2026లో అయితే విశ్వ‌రూపం చూపిస్తున్నాడు. తాజాగా ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై కేవ‌లం 29 బంతుల్లో 97 ప‌రుగులు సాధించాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌రకు 15 మ్యాచ్‌లు ఆడాడు. 45.33 స‌గ‌టు 242.82 స్ట్రైక్‌రేటుతో 680 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు.

ఇక వైభ‌వ్ ఆట వెనుక ఉన్న విజ‌య ర‌హ‌స్యాల‌ను ఓ సారి చూద్దాం..

భ‌యం లేని ఆట‌..
ఎంత మేటి బౌల‌ర్ బౌల‌ర్ అయిన‌ప్ప‌టికి కూడా వారి స్థాయికి భ‌య‌ప‌డ‌కుండా త‌న స‌హ‌జ‌మైన ఆట‌ను ఆడ‌డం వైభ‌వ్ స‌క్సెస్‌కు ప్ర‌ధాన కార‌ణం. తాను బౌల‌ర్ ఎవ‌రు అన్న‌ది చూడ‌న‌ని, బంతిని మాత్ర‌మే గ‌మ‌నిస్తాను అనే విష‌యాన్ని వైభ‌వ్ ఇప్ప‌టికే చెప్పాడు.

Vaibhav Sooryavanshi : వైభ‌వ్‌ను ఎలా ఆపాలో నాకు తెలుసు.. ఎలాగంటే.. జోఫ్రా ఆర్చ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

నిరంత‌ర సాధ‌న‌..
త‌న వ‌య‌సు పిల్ల‌లు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వైభ‌వ్ మాత్రం క‌ఠిన‌మైన సాధ‌న చేస్తుంటాడు. నెట్స్‌లో గంట‌ల కొద్ది గ‌డుపుతుంటాడు. బ్యాటింగ్ చేయ‌డం అంటే ఏదో బాధ్య‌త అన్న‌ట్లుగా కాకుండా ప్రాణంలా భావిస్తాడు. ఎంత సేపు అయినా బ్యాటింగ్ చేయ‌మ‌న్నా చేస్తాన‌ని వైభ‌వ్ తెలిపాడు.

మాన‌సిక స్థైర్యం..
ఎంత‌టి అనుభ‌వం అన్న ఆట‌గాడు అయినా స‌రే.. మ్యాచ్‌లో దిగిన త‌రువాత తొలి బంతికి ఆచితూచి ఆడుతుంటారు. క్రీజులో కుదురుకున్నాక త‌మ విశ్వ‌రూపం చూపిస్తుంటారు. అయితే.. వైభ‌వ్ అలా కాదు. తొలి బంతి నుంచే బాద‌డం మొద‌లుపెడ‌తాడు. అత‌డి ఆట‌లో ఎక్క‌డా భ‌యం క‌నిపించ‌దు. అత‌డికి కూడా మొద‌టి బంతికే ఔట్ అయిపోతాన‌న్న భ‌యం ఉండ‌దు. ఒక‌వేళ ఔటైనా కూడా కుంగిపోడు. అత‌డిపై అత‌డికి న‌మ్మ‌కం ఎక్కువ‌. తాను క్రీజులో ఎంత ఎక్కువ సేపు ఉంటే మ్యాచ్‌లో త‌మ ఆధిప‌త్యం అంత పెరుగుతుంద‌ని అత‌డు చెప్ప‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

దిగ్గ‌జ బౌల‌ర్ల‌ను గౌర‌విస్తూనే..
బ‌య‌ట త‌న కంటే ఎంతో గొప్ప‌నైనా బౌల‌ర్ల‌ను గౌర‌విస్తూ ఉంటాడు. ఒక్క‌సారి మ్యాచ్‌లో దిగాక.. అవ‌న్నీ ప‌క్క‌న బెడుతాడు. బంతి త‌న ఆర్క్‌లో ప‌డిందంటే బాద‌డ‌మే త‌న‌కు తెలుసున‌ని చెబుతుంటాడు. ఇక దిగ్గ‌జ బౌల‌ర్ల‌ను ఎదుర్కొనేందుకు మ్యాచ్‌కు ముందు వారి వీడియోల‌ను చూస్తుంటాన‌ని చెప్పాడు.

Pat Cummins : వైభ‌వ్ సూర్య‌వంశీ కానే కాదు.. అదే మా కొంప‌ముంచింది.. లేదంటేనా.. పాట్ క‌మిన్స్ కామెంట్స్

మ్యాచ్‌కు ముందు స‌న్న‌ద్ద‌త‌..
మ్యాచ్‌కు ముందు ఎక్కువ‌గా ఆలోచించ‌డు. ప్ర‌శాంతంగా ఉంటాడు. ముందు రోజు మైదానం గురించి పూర్తి అవ‌గాహ‌న తెచ్చుకుంటుంటాడు. బౌండ‌రీ లైన్ ఎంత దూరం ఉంది. ఏ వైపు త‌క్కువ దూరం ఉంది? ఏ వైపు ఎక్కువ దూరం ఉంది? వంటి విష‌యాల‌పై పూర్తి అవ‌గాహ‌న తెచ్చుకుంటాడు.