Pat Cummins : వైభవ్ సూర్యవంశీ కానే కాదు.. అదే మా కొంపముంచింది.. లేదంటేనా.. పాట్ కమిన్స్ కామెంట్స్
కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడమే తమ విజయావకాశాలను దెబ్బతీసిందని సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) తెలిపాడు.
Pat Cummins Comments viral after Sunrisers Hyderabad lost Eliminator match against Rajasthan Royals (pic credit@ipl)
- ఎలిమినేటర్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్
- ఐపీఎల్ 2026 నుంచి నిష్ర్కమణ
- కెప్టెన్ పాట్ కమిన్స్ కామెంట్స్ వైరల్
Pat Cummins : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడమే తమ విజయావకాశాలను దెబ్బతీసిందని సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు.
వైభవ్ సూర్యవంశీ (97; 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లు), ధ్రువ్ జురెల్ (50; 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హింజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ మలింగ, శివంగ్ కుమార్, నితీశ్ కుమార్ రెడ్డి లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Nitish Kumar Reddy : నితీశ్‌కుమార్ రెడ్డి బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్
ఆ తరువాత 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే కుప్పకూలింది. దీంతో రాజస్థాన్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో నితీశ్‌కుమార్ రెడ్డి (38), సలీల్ అరోరా (35), ఇషాన్ కిషన్ (33) లు రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీశాడు. నాంద్రే బర్గర్, సుశాంత్ మిశ్రా, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు తీశాడు. యశ్ రాజ్ పుంజా ఓ వికెట్ సాధించాడు.
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు. ఓటమి నిరాశను కలిగించిందన్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చునని, అయితే కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందన్నాడు.
రాజస్థాన్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు చాలా బాగా ఆడాడని అన్నాడు. అతడు అలా బ్యాటింగ్ చేస్తుంటే తాము ఏం చేయలేకపోయామన్నాడు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ఇక అతడు యార్కర్ బంతి కొంత మిస్ అయినా కూడా స్టాండ్స్‌లోకి పంపిస్తున్నాడు. నిజంగా చాలా బాగా ఆడాడు. అని కమిన్స్ అన్నాడు.
Rajat Patidar : ఆర్సీబీ కెప్టెన్ మామూలోడు కాదయ్యా.. రజత్ పాటిదార్ నెట్‌వర్త్ ఎంతంటే?
ఇక టాస్ గెలిచి ఛేజింగ్ తీసుకోవడం పై మాట్లాడుతూ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవాలనే నిర్ణయాన్ని ఇప్పటికి సమర్ధిస్తున్నాను. ఎందుకంటే పిచ్ చివరి వరకు ఒకే విధంగా ఉందన్నాడు. కుర్రాళ్ల ప్రతిభను వెలికితీసాం. ప్రపుల్, సాకిబ్ హుస్సేన్ చాలా అద్భుతంగా ఆడారు. కుర్రాళ్లకు ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న అత్యంత యువ జట్లలో ఈ ఏడాది తమది కూడా ఒకటి అని అన్నాడు. వారు రాణించడం చాలా సంతోషంగా ఉందన్నాడు.
లక్ష్యాన్ని ఛేదించాల్సింది
ముందే చెప్పాను. ఇది చాలా మంచి పిచ్. ఇంతకంటే మంచి పిచ్ మరొకటి ఉండదు. ఇన్నింగ్స్ మొత్తం కూడా దాదాపుగా ఛేదించాల్సిన రన్రేటుతోనే కొనసాగాము. అయితే.. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయాం. దీంతో మా విజయావకాశాలు దెబ్బతిన్నాయి అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఇక మూడేళ్లలో రెండు సార్లు ప్లేఆఫ్స్లు ఆడడంపై మాట్లాడుతూ.. నిజమే చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది టాప్-2లో నిలిచే అవకాశాన్ని కొద్ది తేడాతో కోల్పోయాము. ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేశాము. కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. ఇంతకు మించి వారిని ఇంకా ఏమీ అడగలేము అని కమిన్స్ తెలిపాడు.
